సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ చాలా వరకు యాక్టింగ్ లో క్లిక్ అయితే మళ్ళీ  టెక్నీషియన్ గా మారడానికి సమయం చాలా పడుతుంది. అయితే కొందరు రెండు పనులు చేస్తూ బిజీ అవుతున్నారు. ఇక రైటర్ గా మనం సినిమాతో ;మంచి గుర్తింపు తెచ్చుకున్న అమృతం యాక్టర్ హర్ష వర్ధన్ కూడా డైరెక్షన్ లో నిలదొక్కుకోవాలని అనుకుంటున్నాడు. 

గతంలో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను తెరకెక్కించిన ఈ హర్ష ఇప్పుడు సుదీర్ బాబుతో వర్క్ చేయడానికి సిద్దమయ్యాడు. ఈ ఏడాది సమ్మోహనం సినిమాతో మంచి హిట్ అందుకున్న సుదీర్ ఆ తరువాత నన్ను దోచుకుందువటే సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. 

ఇక రీసెంట్ గా హర్ష వర్ధన్ చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.