కన్నడ స్టార్ హీరో సుదీప్ కి కోపం ఎక్కువ అని ఇండస్ట్రీలో ఎన్ని ఆరోపణలు ఉన్నా అభిమానుల విషయానికి వచ్చేసరికి ఆయన ఆలోచన విధానం మారుతుందని అంటుంటారు. అయితే మరోసారి ఆ విషయంలో బెస్ట్ హీరో అనిపించుకున్నారు సుదీప్. నిరుపేదరికం  ప్రాణాలను హరిస్తుందని తెలుసుకొని ఓ అభిమానికి అండగా ఉండేందుకు సిద్ధమయ్యారు. 

అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానిని ఆదుకునేందుకు వేగంగా ముందుకు వచ్చారు. బెంగుళూరుకు చెందిన 12ఏళ్ల బాలుడు రాహుల్  గత కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్ - అధిక రక్తస్రావంతో బాధపడుతున్నాడు. పరిస్థితి తీవ్రంగా విషమించడంతో వీలైనంత త్వరగా శాస్త్ర చిక్కిత్స చేయాలనీ వైద్యులు చెప్పారు. 

అందుకు 12 లక్షలు ఖర్చవుతుందని కొంత డబ్బు సమకూర్చుకొని మరికొంత డబ్బుకోసం తల్లిదండ్రులు బాలుడికి ఇష్టమైన అభిమాన హీరోను సంప్రదించారు. సోషల్ మీడియా ద్వారా సంప్రదించడంతో వెంటనే తన ఇంటికి రావాల్సిందిగా సుదీప్ సమాధానం ఇచ్చారు. బాలుడి ఆరోగ్యం విషయంలో పూర్తి బాధ్యత తనదని అన్ని రకాలుగా అండగా ఉంటానని సుదీప్ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.