Asianet News TeluguAsianet News Telugu

అలాంటి సీన్స్ చేసే హీరోయిన్లు దొరకట్లేదు.. చాలా బిజీగా ఉంటున్నారు.. ‘ది ఘోస్ట్’ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.!

హీరోయిన్లపై ‘ది ఘోస్ట్’ (The Ghost) డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కాబోతుండటంతో మూవీ ప్రారంభంలో తనకు కావాల్సిన హీరోయిన్ దొరకలేదంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

Such heroines are not found, The Ghost Movie directors shocking comments!
Author
First Published Oct 2, 2022, 11:18 AM IST

కింగ్, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు  కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న భారీ యాక్సన్ ఫిల్మ్ ‘ది ఘోస్ట్’. ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగార్జున పవర్ ఫుల్ ఇంటర్పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) నటించిన విషయం తెలిసిందే. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ చిత్రాన్ని నిర్మించారు. భారీ హైప్ క్రియేట్ చేస్తున్న  ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు  ప్రమోషన్స్ లో భాగంగా  మాట్లాడుతూ హీరోయిన్లపై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. 

‘ది ఘోస్ట్’ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ గా రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో సినిమా ప్రారంభంలో హీరోయిన్ల ఎంపికలో కాస్తా ఇబ్బందులు ఏర్పడ్డాయని దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తెలిపారు. మూవీలో ఎక్కువ శాతం యాక్షన్ సీన్స్ ఉండటం.. అందులోనూ హీరోయిన్ పాత్ర కూడా యాక్షన్ సన్నివేశాలను చేయాల్సి రావడంతో అందుకు తగిన హీరోయిన్ ను పట్టుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. ఇప్పటికే యాక్షన్‌ చేసే హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎక్కువగా  లేరని అభిప్రాయపడ్డారు. తొలుత కాజల్‌ ను అనుకున్నా.. ఆమె తప్పుకోవడంతో చాలా మంది హీరోయిన్లని సంప్రదించాల్సి వచ్చిందంట. 

శృతి హాసన్‌, అమలా పాల్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌లను కూడా ‘ది ఘోస్ట్’ కోసం అడిగారంట. కానీ వారు కూడా బిజీగా ఉండటంతో సెట్‌ కాలేదన్నారు. ఇక యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టే హీరోయిన్ నే కావాలని వెతకగా చివరికి సోనాల్‌ ఫైనల్ అయ్యిందన్నారు. ప్రవీణ్ సత్తారు చేసిన వ్యాఖ్యలు నిజానికి హీరోయిన్లకు సవాల్ గా మారిందని కొందరు అంటున్నారు. ప్రస్తుతం యాక్షన్ మూవీలకు కూడా డిమాండ్ పెరగడంతో హీరోయిన్లు కూడా యాక్షన్ సీన్స్ లోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం కావాల్సి వస్తోంది. అలాగైతేనే ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటోంది. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్లు సమంత, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, నయనతార, పూజా హెగ్దే యుద్ధ విద్యల్లోనూ శిక్షణ పొందుతున్న విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios