‘మళ్లీరావా’సినిమాతో చాలా కాలం తర్వాత ఓ మంచి హిట్ ని  అందుకున్నాడు హీరో సుమంత్‌. ఆయన ప్రస్తుతం సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ‘సుబ్రమణ్యపురం’ సినిమా చేస్తున్నారు. టారస్‌ సినీకార్స్‌ పతాకంపై ధీరజ్‌ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈషా హీరోయిన్.

ఆధ్యాత్మిక అంశాలతో కూడిన వైవిధ్యమైన కథాంశంతో రుపొంతున్న ఈ చిత్రంలో సుమంత్ దేవుడినే ఎదిరించే వ్యక్తిగా సుమంత్ అలరించబోతున్నాడు.  ఈ  చిత్రం ట్రైలర్ ని రీసెంట్ గా విడుదల చేసారు నిర్మాతలు. సుబ్రహ్మణ్యపురం అనే ఊరిలో ఉన్న ఓ దేవాలయంలో అంతుచిక్కని మిస్టరీని చేధించే పాత్రలో సుమంత్ మనకు ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నారు.

ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ ట్రైలర్ చూసిన వారంతా ఇంతకు ముందు నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ చిత్రం గుర్తు వస్తోందంటున్నారు. అయితే కథ ప్రకారం ఈ రెండు వేర్వేరు అని కాస్త క్లియర్ గా చూస్తే అర్దమవుతోంది. ఏదైమైనా సుమంత్ సినిమాలలో ఈ మాత్రం ఉత్కంఠ రేపే సినిమాలు కూడా రావటం అరుదు కాబట్టి..ఇది హాట్ టాపిక్ గా మారింది. మీరూ ఈ ట్రైలర్ చూడండి. 

నిర్మాతలు మాట్లాడుతూ..‘‘చక్కటి, ఆసక్తికర అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్‌ ఇది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది. సుమంత్‌ పాత్ర చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది ’’న్నారు. ఇది సుమంత్‌ నటిస్తున్న 25వ సినిమా. ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్‌, సంగీతం: శేఖర్‌చంద్ర, ఛాయాగ్రహణం: ఆర్‌.కె.ప్రతాప్‌.