మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు అంటే సామాన్యంగా బ్రేకులు పడవు. పక్కా ప్లానింగ్ తో సినిమాను అనుకున్న సమయం కంటే తొందరగానే పూర్తి చేస్తాడు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తోన్న సినిమా పనులు కూడా ఊపందుకున్నాయి. 

సినిమాను షూటింగ్ స్టార్ట్ చేసి మూడు నెలలైనా పూర్తి  కాకముందే అప్పుడే డబ్బింగ్ పనులను మొదలుపెట్టారు. గురువారం ఉదయం శబ్దాలయ స్టూడియోలో డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసేముందు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సెకండ్ షెడ్యూల్ అనంతరం బన్నీ పాత్రకు కాస్త గ్యాప్ రావడంతో డబ్బింగ్ పనులను ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకుంటే బెటర్ అని స్టార్ట్ చేశారు.

 పైగా బన్నీ మరో రెండు సినిమాలను కూడా సెట్స్ పైకి తెచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ - సుకుమార్  సినిమాలను కూడా త్వరత్వరగా ఫినిష్ చేయాలనీ డేట్స్ సెట్ చేసుకున్నాడు. సో ఆ సినిమాల చేసే సమయంలో గ్యాప్ ఉండదు కాబట్టి ముందే త్రివిక్రమ్ సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.