బోయపాటికి తో రామ్ -లక్ష్మణ్ లకు విభేదమా ? సినిమా నుంచి అవుట్

బాలకృష్ణ హీరోగా ఆయన ఆస్థాన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితం మొదలైన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.'సింహా', 'లెజెండ్‌' ఈ రెండు చిత్రాలతో వారు క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌  తెలియంది కాదు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ ఆ విషయాలని చెప్పకనే చెప్పేసింది. శ్రీనుగారూ.. అంటూ బాలయ్య చెప్పే డైలాగ్‌తో ఈ సినిమా రేంజ్‌ ఏ విధంగా ఉండబోతోందో ఫ్యాన్స్ కు అర్థమైంది. ఈ నేపధ్యంలో ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కు ఏ స్దాయి ప్రిఫరెన్స్ ఉంటుందో అర్దం చేసుకోవచ్చు. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ అనగానే రామ్ లక్ష్మణ్ లు ఉంటారు. 

Stunt Choreographers Walk Out from balayya,boyapati film? jsp

బాలకృష్ణ హీరోగా ఆయన ఆస్థాన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితం మొదలైన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.'సింహా', 'లెజెండ్‌' ఈ రెండు చిత్రాలతో వారు క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌  తెలియంది కాదు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ ఆ విషయాలని చెప్పకనే చెప్పేసింది. శ్రీనుగారూ.. అంటూ బాలయ్య చెప్పే డైలాగ్‌తో ఈ సినిమా రేంజ్‌ ఏ విధంగా ఉండబోతోందో ఫ్యాన్స్ కు అర్థమైంది. ఈ నేపధ్యంలో ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కు ఏ స్దాయి ప్రిఫరెన్స్ ఉంటుందో అర్దం చేసుకోవచ్చు. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ అనగానే రామ్ లక్ష్మణ్ లు ఉంటారు. 

అలాగే వారు చేసే సీన్స్ మన తెలుగుదనం ఉట్టిపడుతూ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. అయితే చిత్రంగా ఏమి జరిగిందో ఏమో ..ఈ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఇద్దరూ ఈ ప్రాజెక్టునుంచి వైదొగిలినట్లు వార్తలు వస్తున్నాయి. బోయపాటికి, వీరికి మధ్య వచ్చిన విభేధాలే అందుకు కారణం అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. బోయపాటి తిరిగి ఫామ్ లోకి రావటానికి ఈ సినిమాకు ప్రాణం పెట్టి చేస్తున్నారు.. ఏ చిన్న పొరపాటుని క్షమించేలా లేరంటున్నారు టీమ్. అయితే రామ్ లక్ష్మణ్ ల వర్క్ కూడా అదే స్దాయిలో ఉంటుంది. మరి ఎక్కడ ఏ సమస్య వచ్చిందో మరి. బాలయ్య ఈ విషయమై ఎలా స్పందించారో తెలియదు.

ఇక రీసెంట్‌గా ఈ సినిమాకు రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు. విశ్వ విఖ్యాత న‌ట‌సార్వభౌమ, న‌ట‌ర‌త్న శ్రీ నందమూరి తారక రామారావు జయంతి రోజైన మే 28న 'బీబీ3' చిత్రాన్ని విడుదల చేయాలని బాలయ్య సంకల్పించారు. అయితే ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కు సంబంధించి మేకర్స్ ఎప్పుడో విడుదల తేదీని ప్రకటించేసారు కానీ ఈ పవర్ ఫుల్ సబ్జెక్టు కు టైటిల్ ఏది ఫైనలైజ్ చేసారో అన్నది ఇంకా సస్పెన్సుగా కొనసాగిస్తూనే ఉన్నారు.

గాడ్ ఫాధర్ టైటిల్ అనుకున్నారని...శివరాత్రి సందర్భంగానే రివీల్ చేస్తారని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ మేకర్స్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios