Asianet News TeluguAsianet News Telugu

రానా వివాహంలో ఆ స్టిక్ట్ రూలే, అందరినీ కాపాడింది

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పెళ్లి వేడుక ముగించారు. రానా–మిహిక పెళ్లి వీడియో, ఫొటోలు బాగా వైరల్‌ అయ్యాయి కూడా. ఈ వివాహం చాలా ప్రశాంతంగా ఏ విధమైన ఇబ్బందీ లేకుండా ముగియటానికి కారణం..సురేష్ బాబు పెట్టిన ఓ స్ట్రిక్ట్ రూల్ అని తెలుస్తోంది

STRICT RULE implement at RANAS WEDDING
Author
Hyderabad, First Published Aug 27, 2020, 7:09 AM IST

నటుడు రానా దగ్గుబాటి ఒక ఇంటివాడయ్యిన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు మిహికా బజాజ్ ను కుటుంబ సభ్యుల నడుమ పెళ్లిచేసుకుని తన జీవితంలోకి స్వాగతం పలికాడు. ఈ నెల 8న వీరి పెళ్లి హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో దగ్గుబాటి, మిహికా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పెళ్లి వేడుక ముగించారు. రానా–మిహిక పెళ్లి వీడియో, ఫొటోలు బాగా వైరల్‌ అయ్యాయి కూడా. ఈ వివాహం చాలా ప్రశాంతంగా ఏ విధమైన ఇబ్బందీ లేకుండా ముగియటానికి కారణం..సురేష్ బాబు పెట్టిన ఓ స్ట్రిక్ట్ రూల్ అని తెలుస్తోంది.

ఆ రూల్ ఏమిటంటే... పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తో సహా కుటుంబాలు, వారి స్టాఫ్ పంక్షన్ ప్రారంభం కావటానికి ముందు రెండు సార్లు కరోనా టెస్ట్ చేయించుకోవాలి. అలాగే అంతమందిలో ఎవరికి కరోనా వచ్చినా వెంటనే పంక్షన్ వాయిదా వేయాలి. అంతేకాకుండా వివాహానికి ముందు పది రోజులు పాటు స్టాఫ్ ఎవరూ కూడా బయిటకు వెళ్లకూడదు. ఎవరినీ కలవకూడదు. ఇవన్నీ ఒప్పుకున్న వారికే వివాహంలో ఎంట్రీ ఇచ్చారు. ఈ స్ట్రిక్ట్ రూల్స్ అన్నీ సురేష్ బాబు దగ్గరుండి మొహమాటం లేకుండా ఇంప్లిమెంట్ చేసారు. కాబట్టే ఎక్కడా ఏ సమస్యా లేకుండా వివాహం జరిగింది. 
 
ఇక కోవిడ్‌ కారణంగా ఈ కొత్త జంట హనీమూన్‌ని కొన్నాళ్లు వాయిదా వేసుకుంది. ‘‘మా హనీమూన్‌ కోసం ఆమ్‌స్టర్‌డ్యామ్‌ని సెలక్ట్‌ చేసుకున్నాం. నాకు ఆర్ట్‌ అంటే ఇష్టం. ఆమ్‌స్టర్‌డ్యామ్‌ ఆర్టిస్టిక్‌గా ఉంటుంది. అందుకే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నా. మిహికా కూడా ఆ ప్లేస్‌కి ఓకే చెప్పిది. కరోనా వైరస్‌ ప్రభావం లేకపోతే ఇప్పుడే వెళ్లేవాళ్లం. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే మా హనీమూన్‌ ఉంటుంది’’ అని పేర్కొన్నారు రానా.

Follow Us:
Download App:
  • android
  • ios