Asianet News TeluguAsianet News Telugu

సూపర్ హిట్ '2018'.. వచ్చే వారమే OTTలో..ఏ ప్లాట్ ఫామ్ అంటే?

 2018 నాటి కేరళ వరద బీభత్సాన్ని నేపథ్యంగా తీసుకున్నాడు దర్శకుడు జూడ్ ఆంటోనీ జోసెఫ్. మలయాళ సినిమా మార్కెట్ పరిధి చిన్నదైనా.. బడ్జెట్ పరిమితులున్నా.. వరద దృశ్యాలను అద్భుత రీతిలో తెరకెక్కించడం ఈ సినిమాలో మేజర్ హైలైట్

Streaming Date Locked For Latest Blockbuster 2018
Author
First Published May 30, 2023, 4:11 PM IST


ప్రముఖ మళయాళ దర్శకుడు జూడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 2018. ఈ  చిత్రం మొదట తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి..ఊహించని విధంగా ఓ వారంలోనే పెద్ద సక్సెస్ అయ్యింది.  బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిందీ మలయాళి చిత్రం. మలయాళి ఇండస్ట్రీలో రూ. 150 కోట్లు కలెక్ట్‌ చేసిన ఏకైక చిత్రంగా నిలిచిందీ మూవీ. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి అనూహ్య విజయాన్ని అందుకుంది. మలయాళంలో భారీ విజయం అందుకోవడంతో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోందీ సినిమాకు. 

 కాంతార విడుదల లాంటి మంచి సినిమాలను తెలుగులో అందించిన గీతా ఆర్ట్స్ సంస్థ.. 2018ను కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మలయాళంలో ఈ సినిమా మే5వ తేదీన విడుదలకాగా, తెలుగులో మాత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడీ చిత్రం ఓటిటి రిలీజ్ గురించిన వార్త బయిటకు వచ్చింది. ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని SonyLIV సొంతం చేసుకుంది. జూన్ 7 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. కరెక్ట్ గా రిలీజైన నెలకు ఓటిటిలో వచ్చేస్తుంది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించక ఓటిటి రైట్స్ నెల రోజుల్లోనే స్ట్రీమింగ్ చేసుకునేలా ఎగ్రిమెంట్ చేసేసారు. ఇప్పుడు మారుద్దామంటే కుదరని పని. 

ఓటిటి సంస్ద ఒప్పుకోదు. ఒప్పుకున్నా పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. దాంతో అదే రోజుకి  ఓటిటిలో రిలీజ్ చేసేస్తున్నారు. అంటే మరో వారం రోజుల్లో ఓటిటిలో చూడవచ్చు అన్నమాట. తెలుగు వెర్షన్ లో కూడా ఈ సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఈ సినిమాను జూన్‌ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నారనే  విషయాన్ని సోనీలివ్‌ అధికారికంగా వెల్లడించింది. 
 
టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.
 
చిత్రం కథేమిటంటే..2018లో కేరళను అతలాకుతలం చేసిన వరద బీభత్సం చుట్టూ తిరిగే కథ ఇది. ప్రాణ భయంతో సైన్యం నుంచి వెనక్కి వచ్చేసిన ఒక కుర్రాడు.. సముద్రంలో చేపలు పట్టుకుంటూ జీవిస్తూ సమాజంలో చిన్నచూపుకి గురయ్యే ఒక కుటుంబం... పర్యాటకుల కోసం ట్యాక్సీ నడిపే ఒక డ్రైవర్.. భార్యకు దూరంగా దుబాయిలో ఉద్యోగం చేసుకుంటున్న మరో వ్యక్తి.. తమిళనాడు నుంచి కేరళకు పేలుడు పదార్థాలు తీసుకొస్తున్న ఒక ట్రక్ డ్రైవర్.. ఇలా పలువురు కేరళ వరదల్లో చిక్కుకుంటారు. వీళ్లంతా ఈ ఉపద్రవం నుంచి బయటపడ్డారా లేదా.. ఈ క్రమంలో వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. అంతిమంగా ఏం జరిగింది అన్నది మిగతా కథ.
 

Follow Us:
Download App:
  • android
  • ios