Asianet News Telugu

`రాధే శ్యామ్`‌ ఫస్ట్ లుక్‌లో ఈ స్టోరి క్లూలు గమనించారా?

ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ముందు నుంచే ప్రచారంలో ఉన్న 'రాధే శ్యామ్' అనే టైటిల్ ను ప్రభాస్ కోసం ఫైనల్ చేశారు. 

story clues in Prabhas Radhe Shyam First Look
Author
Hyderabad, First Published Jul 10, 2020, 11:56 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి 'రాధే శ్యామ్' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ - పూజాహెగ్డే లను చూసిన వారు ఈ సినిమా ఒక ఫ్యూర్ లవ్ స్టోరీ గా డిజైన్ చేయబడిందని అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా 'రాధే శ్యామ్' టైటిల్ చూస్తుంటే ఈ సినిమా ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ని పూర్తిగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. రెబర్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ టీ సిరీస్ వారు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్ లో మరిన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూస్తే గమనించవచ్చు.

ఈ పోస్టర్ లో ...సూట్ లో జెంటిల్ మెన్ లుక్ లో ఉన్న ప్రభాస్ రెడ్ గౌన్ లో రిచ్ గా పూజా హెగ్డేతో ఓ రొమాంటిక్ పోజ్ తో కనిపించారు. ఇక పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఇటలీ దేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశం అయినా కల్లోజియం కనిపిస్తుంది. అలాగే ప్రభాస్, పూజ హెగ్డే గెటప్స్ చూస్తుంటే ఇటలీ దేశంలో 1960ల కాలానికి చెందిన ఓ హై క్లాస్ సొసైటీ కి చెందిన ప్రేమ జంటగా కనిపిస్తున్నారు. 

ఇక పోస్టర్ లో రోమ్ నగరాన్ని ఓ విపత్తు ముంచెత్తున్నట్లు గా కూడా ఉంది. ఏదిఏమైనా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన దర్శకుడు ఆసక్తి రేపాడు. ఇక ఈ మూవీ 2021లో విడుదల చేస్తున్నట్లుగా కూడా చెప్పడం గమనార్హం.  అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో 'రాధే శ్యామ్' మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది మాత్రం ప్రకటించలేదు. 

దీంతో సోషల్ మీడియా వేదికగా డిస్కషన్ స్టార్ట్ చేశారు  ఫ్యాన్స్. చాలా రోజుల నుండి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటూ రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంగీత దర్శకుడు ఎవరనేది క్లారిటీ వస్తుందని అభిమానులు భావించారు.ఇక మనోజ్ పరమహంస డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరిస్తుండగా కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. 

పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర భాషల నటీనటులు కూడా 'రాధే శ్యామ్' లో యాక్ట్ చేస్తున్నారు. సీనియర్ నటి భాగ్యశ్రీ స్టార్ కమెడియన్ ప్రియదర్శి తమిళ నటుడు సత్యన్ మలయాళ నటుడు సచిన్ ఖేడేకర్ ఎయిర్టెల్ యాడ్ ద్వారా పాపులరైన షాషా ఛత్రి బాలీవుడ్ నటుడు కునాల్ రాయ్ కపూర్ ప్రముఖ నటుడు మురళి శర్మ సహా మరికొందరు ఇతర తారాగణం ఈ సినిమాలో కనిపిస్తున్నారు. 

లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ తమిళ్ మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాని 2021 లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్న మేకర్స్ అనౌన్స్ చేసారు. 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios