సౌత్ లో కంటే నార్త్ స్టేట్స్ లలో రూమర్స్ కి డోస్ ఎక్కువ. అక్కడి కొన్ని మీడియా  సంస్థలు డప్పు కొట్టడం మొదలెడితే పిట్టా గోడ నుంచి యూనివర్సిటీ ల వరకు రూమర్స్ ఈజీగా స్ప్రెడ్  అవుతాయి. ప్రస్తుతం ప్రభాస్ కు సంబందించిన పొలిటికల్ న్యూస్ ఒకటి అలానే వైరల్ అవుతోంది. 

మోడీ కన్ను ప్రభాస్ పై పడిందని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మరియు కొన్ని నార్త్ స్టేట్స్ లలో జరగబోయే ఎలక్షన్స్ లో ప్రచారాల కోసం బాహుబలి స్టార్ ను వాడలబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రభాస్ పెదనాన్న భారత జనతా పార్టీలో గత కొంత కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మోడీ ఆయనతో ఏపి రాజకీయాలపై చర్చలు జరిపి ప్రభాస్ గురించి కూడా చర్చించినట్లు సమాచారం. 

ఇప్పుడే కెరీర్ ఊపందుకున్న సమయంలో పాలిటిక్స్ లోకి ప్రభాస్ వెళ్లే ప్రయత్నమైతే చేయడు. సినిమా కోసం కష్టపడే ప్రభాస్ వేరే విషయాలలో మాత్రం అస్సలు జోక్యం చేసుకోడు అనేది వాస్తవం. కానీ కొంత మంది నార్త్ జనాలు మాత్రం ప్రభాస్ బీజేపీ కి మద్దతు ఇస్తున్నట్లు డప్పు కొట్టేస్తున్నారు.  మీడియాలో కూడా రూమర్స్ వస్తుండడంతో మరోసారి ప్రభాస్ పేరు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై ప్రభాస్ వీలైనంత త్వరగా క్లారిటీ ఇస్తే బెటరేమో..