మహేష్‌ నుంచి సినిమా వచ్చి ఏడాదవుతుంది. ఆయన చివరగా `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ సినిమా ముందుగా యావరేజ్‌ టాక్‌ వచ్చినా సంక్రాంతి సీజన్‌ కావడంతో మంచి కలెక్షన్లని రాబట్టింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా విడుదలై నేటితో ఏడాది పూర్తయ్యింది. ఏడాది పూర్తయిందని సందడి చేస్తుంది టీమ్‌. అయితే ఇప్పటి వరకు మహేష్‌ మరో సినిమాని పట్టాలెక్కించకపోవడం గమనార్హం. 

మహేష్‌ ఆ తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారువారి పాట` చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన, పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. డిసెంబర్‌ ఎండింగ్‌లోగానీ, జనవరి ప్రారంభంలోగానీ రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ లేదు. స్క్రిప్ట్ విషయంలో డిలే అవుతుందా? లేక ఆలస్యమయ్యే కొద్ది ప్రాజెక్ట్ విషయంలో ఏదైనా డౌట్స్ క్రియేట్‌ అవుతున్నాయా? అన్నది సస్పెన్స్ నెలకొంది. ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. జీఎంబీ, 14ప్లస్‌, మైత్రీ మూవీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. 

మరోవైపు మహేష్‌, వెంకటేష్‌ నటించిన మల్టీస్టారర్‌ చిత్రం `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రం విడుదలై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. మల్టీస్టారర్‌ చిత్రాల్లో కొత్త ట్రెండ్‌ సృష్టించిన చిత్రమిది. ఫ్యామిలీ అనుబంధాలన ప్రధానంగా రూపొంది సూపర్‌ హిట్‌గా నిలిచింది. శ్రీకాంత్‌ అడ్డాల రూపొందించిన ఈ సినిమాలో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు దీన్ని నిర్మించారు.