కన్నడ స్టార్ హీరో యష్ (Yash)పై అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు స్టార్స్. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’తో ప్రపంచాన్నే కన్నడ ఇండస్ట్రీవైపు తిరిగి చూసేలా చేశాడు రాఖీబాయ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటున్న యష్ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటోంది.
KGF 2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజై అద్భుతమైన హిట్ అందుకుంది. వసూళ్ల పరంగా ఈ చిత్రం మొదటి భాగం కన్నా కూడా రెండో భాగం రికార్డులను తిరగ రాస్తోంది. అయితే ఈ సందర్భంగా కన్నడ స్టార్ హీరో యష్ (Yash)కు ఇండియన్ స్టార్ యాక్ట్రెస్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. కన్నడ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 (Kgf Chapter 2)తో ప్రపంచ వ్యాప్తంగా రీచ్ అయిన సందర్భంగా చిత్ర యూనిట్ ను అభినందిస్తున్నారు.
ఈ సందర్భంగా తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal) యష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కేజేఎఫ్ రెండు పార్టులతో బాక్సాఫీసు రికార్డలను తొక్కుకుంటుపోతున్న తరుణంలో ప్రత్యేక అభినందలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ప్రియమైన స్నేహితుడు యష్ కు అభినందనలు. కేజీఎఫ్ ఛాప్టర్ 2 మొత్తం టీమ్ కు, తారాగణానికి, సిబ్బంది ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కు స్పెషల్ విషెస్ తెలుపుతున్నాను. మాగ్నమ్ ఓపస్ బ్లాక్ బస్టర్ KGF2తో
నా స్నేహితుడు కన్నడ సినిమాను ప్రపంచవ్యాప్తంగా చేరువ చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ దూకుడును ఇలాగే కొనసాగించాలి రాఖీబాయ్’ అంటూ ట్వీట్ చేశాడు హీరో విశాల్.
అలాగే టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) కూడా ఈ చిత్రం క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోయారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘కన్నడ గ్రేటెస్ట్ సినిమాల్లో KGF ఒకటిగా ఉండిపోతుంది. కేజీఎఫ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. KGF2తో మంచి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మొత్తం టీమ్‌కి అభినందనలు తెలుపుతున్నాను. ఇంత పెద్ద సక్సెస్ ను అందుకున్న యష్, ప్రశాంత్ నీల్, హుంబాలె ఫిల్మ్స్ కు ప్రత్యేక శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
ఇక హీరో యష్ నటనతోనే కాకుండా.. తన ప్రవర్తనతోనూ ప్రేక్షకుల హ్రుదయాలను దోచుకుంటున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రమోషన్స్ లో భాగంగా విలేకర్లు తనకు సంధించన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా, ఎలాంటి గర్వం లేకుండా బదులిచ్చాడు. ముఖ్యంగా తను ఒక నటుడినేనని, బాలీవుడ్, టాలీవడ్ ఇండస్ట్రీల్లోని పెద్ద హీరోలతో తనను పోల్చొదని తెలిపారు. తనూ వాళ్ల సినిమాలను స్ఫూర్తిగా తీసుకొని నటుడిగా ఎదిగినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక పాన్ ఇండియా హవా కొనసాగుతున్న నేపథ్యంలో.. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సినిమాలని కాకుండా ఇండియన్ సినిమాగా గుర్తించాలని యష్ అందిరినీ కోరాడు.
