బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన 'కొబ్బరిమట్ట' సినిమా ఊహించని విధంగా విజయాన్ని అందుకుంది. మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా బీ, సీ సెంటర్స్ లో బాగా ఆడుతోంది. ఈ సినిమా సక్సెస్ తో చిత్రబృందం సంబరాలు జరుపుకుంటున్నారు.

ఈ క్రమంలో సినిమా విడుదల కోసం పడ్డ కష్టాలు, మూడున్నర నిమిషాల డైలాగ్ ని సింగిల్ టేక్ లో చెప్పడానికి చేసిన హార్డ్ వర్క్, తన రెమ్యునరేషన్ ఇలా కొన్ని విషయాల గురించి చెప్పుకొచ్చాడు సంపూ. డైలాగ్స్ చెప్పడంతో మోహన్ బాబు గారు తనకు ఆదర్శమని, ఇంతకముందు ఒకటిన్నర నిమిషం పాటు డైలాగ్ చెప్పానని.. ఇప్పుడు ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి మూడున్నర నిమిషాల్ డైలాగ్ చెప్పినట్లు వెల్లడించారు.

తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. తొలి సినిమా 'హృదయ కాలేయం'తో హీరో అవ్వాలనే తన కోరిక తీరిందని.. అయితే ఆ సినిమాకి నేను చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నానని.. లక్షల్లో తీసుకోలేదని చెప్పారు. ఇష్టపడి పనిచేస్తున్నప్పుడు ఆదాయాన్ని ఆశించలేమని.. వృత్తి అయినప్పటికీ కమర్షియల్‌గా చూడలేమని అన్నారు.

నిర్మాత తనను నమ్మి చేశాడు కాబట్టి రెమ్యూనరేషన్‌ కోసం చూసుకోలేదని అన్నారు. కాగా ‘హృదయకాలేయం’, ‘కొబ్బరి మట్ట’ చిత్రాలతో సంపూ రేంజ్ ఒక్కరోజుకు రెండు నుండి మూడు లక్షలకుఆయన రేటు పెరిగినట్టు తెలుస్తోంది.