లాక్ డౌన్  తరువాత  ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో  రిలీజ్ అయిన మొదటి సినిమా  'షాదీ ముబారక్'.   ఆర్.కె సాగర్ హీరోగా వచ్చిన  ఈ  ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్  ఐఎండిబి(ఇంటర్నెట్ మూవీ డేటా బేస్)లో  ఏకంగా 9.1 రేటింగ్ తో ఈ సినిమా టాప్ లిస్ట్ లో నిలిచిన సంగతి తెలిసిందే.  అయితే  ఆర్కే సాగర్ నుండి మరో  ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్  వస్తున్నట్టు తెలుస్తుంది.  

టాలెంటెడ్ డైరెక్టర్ 'రమేష్ దేశిన' దర్శకత్వంలో తెరకెక్కుతున్న  యాక్షన్ సస్పెన్స్  థ్రిల్లర్ చాల బాగా వస్తోందని,  అద్భుతమైన ఎమోషన్స్ తో పాటు కొన్ని బలమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్  కూడా  సినిమాలో చాల బాగా కుదరడంతో  ఈ సినిమాని కూడా 'దిల్ రాజు' తన బ్యానర్ లోనే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.    

  అన్నట్టు ఈ సినిమాలోని కథకథనాలతో పాటు  ఈ కథ జరిగే  నేపథ్యం కూడా  ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ అట. అలాగే  దర్శకుడు రమేష్ దేశిన రాసుకున్న సున్నితమైన ప్రేమ కథ కూడా సున్నితమైన ఎమోషన్స్ తో సాగుతుందని..  ముఖ్యంగా సాగర్ ను  ఈ సినిమాలో దర్శకుడు  చాల కొత్తగా చూపించబోతున్నాడని తెలుస్తోంది.