Asianet News TeluguAsianet News Telugu

యంగ్ ప్రొడ్యూసర్ ను ప్రశంసించిన స్టార్ ప్రొడ్యూసర్.. ‘మసూద’ టాక్ పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మళ్లీ రావా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల తర్వాత యంగ్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నిర్మించిన చిత్రం ‘మసూద’. చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రాహుల్ ను అభినందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 

Star producer Dil Raj Congratulations to the young producer of Masooda movie!
Author
First Published Nov 21, 2022, 4:59 PM IST

విభిన్న కథలను ఎంచుకొనే నిర్మాత రాహుల్ యాదవ్ (Rahul Yadav) ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి థ్రిల్లర్ తరువాత నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’ (Masooda). తిరువీర్ హీరోగా,  హీరోయిన్ గా సంగీత,  కావ్య కళ్యాణ్ రామ్ నటించారు. బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్, తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. నక్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ హారర్ డ్రామాను నిర్మించారు. డెబ్యూ దర్శకుడు సాయికిరణ్ డైరెక్షన్ చేశారు. ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఎస్‌వీసీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశారు. మూడు రోజుల్లో దాదాపు రూ.1.5 కోట్ల షేర్ ను కూడా కలెక్ట్ చేసినట్టు  తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టుకుంటోంది ‘మసూద’. రోజురోజుకూ కలెక్షన్స్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) చిత్రయూనిట్ తో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయనే కార్యక్రమాన్ని లీడ్ చేయడంతో నిర్మాత రాహుల్ యాదవ్ నుంచి ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. సినిమాల పట్ల రాహుల్ చూపిస్తున్న శ్రద్ధ, పట్టుదలను ప్రశంసించారు. 

దిల్ రాజు మాట్లాడుతూ.. నేను యూనివర్సల్ ఆడియన్స్‌కి సినిమా ఎలా రీచ్ అవ్వాలని ఆలోచించే ప్రొడ్యూసర్‌ని. కానీ రాహుల్ అలా కాదు.. నేను బంతి కొట్టా.. అది క్యాచా? లేదంటే బౌండరీ బయటపడిందా? అంతే.. రెండే ఆప్షన్స్. నో సింగిల్స్... అనే రకం. నేను సింగిల్స్ తీసి ఆరు పరుగులు చేద్దామనుకుంటా. కానీ రాహుల్ అలా కాదు. కానీ ఇలా సినిమాపై ఇంత అభిరుచితతో ఉండే ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ. అంతలా సినిమాని ప్రేమిస్తాడు. ఇంతకు ముందు ఆయన తీసిన రెండు సినిమాలు చూసిన తర్వాత.. ఒకసారి నిర్మాతల కోసం ఏర్పాటు చేసిన వేడుకలో రాహుల్‌కి ఓ ఆఫర్ ఇచ్చా. నీకు ఇష్టమైన సినిమా తీసుకో.. ఎస్‌విసి బ్రాండ్ ఇస్తాను, వాడుకో అని చెప్పా. ఎందుకంటే.. ఆయనలోని అభిరుచి నాకు అంత బాగా నచ్చిందంటూ అభినందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios