బిగ్‌బాస్‌కి భాషలకు అతీతంగా భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ తోపాటు యూత్‌ సైతం దీన్ని చూసేందుకు ఎగడబడతారని చెప్పొచ్చు. అంతగా భారీ ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది. ప్రస్తుతం రన్‌ అవుతున్న నాల్గో సీజన్‌కి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బిగ్‌బాస్‌ ఫ్యాన్స్ కి బిగ్‌ షాక్‌ ఇవ్వాలని స్టార్‌ మా నిర్ణయించుకుందట. బిగ్‌బాస్‌ ప్రసార సమయవేళల్లో మార్పులు చేయబోతుంది. 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 13వ వారం కొనసాగుతుంది. ఇంట్లో ఏడుగురు సభ్యులున్నారు. మరో రెండు వారాల్లో షో ముగియబోతుంది. ఈ సమయంలో ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. బిగ్‌బాస్‌ ప్రసార సమయవేళ్లలో మార్పులు చేయబోతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30గంటలకు బిగ్‌బాస్‌ ప్రసారం కానుంది. ఇకపై 10గంటలు ప్రసారం కానుందని సమాచారం. 

తొమ్మిదిన్నర గంటలకు `వదినమ్మ` సీరియల్‌ని ప్రసారం చేయనున్నారట. అందుకోసం అరగంట ఎక్స్ టెండ్‌ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌ పీక్‌ ఎపిసోడ్స్ సాగుతుంది. రోజు రోజుకి ఏం జరుగుతుందనేది ఆసక్తి నెలకొంది. ఇక పద్నాలుగు, పదిహేను వారాలు మరింత ఉత్కంఠభరితంగా సాగుతాయి. దీంతో కచ్చితంగా ఆడియెన్స్ ఏ టైమ్‌లో అయినా చూస్తారనే నమ్మకంతో ఈ మార్పులు చేసినట్టు తెలుస్తుంది. అయితే శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి తొమ్మిది గంటలకే బిగ్‌బాస్‌ని ప్రసారం చేయనున్నారట. మరి దీనిపై బిగ్‌బాస్‌ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.