Asianet News TeluguAsianet News Telugu

వంటలక్క లెక్కే వేరు..టీఆర్పిలో ఆల్ టైమ్ రికార్డ్!

 బిగ్ బాస్ పోగ్రామ్..క్రికిట్ ప్రియుల .. ఐపీఎల్.. కొత్త సినిమాలు డైరక్ట్ రిలీజ్ లు. కానీ.. ఇవేవీ వంటలక్క కు బ్రేక్ లు వేయలేకపోతున్నాయి. కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు నెంబర్ వన్ పొజీషన్ అందరినీ, అన్నటినీ నెట్టి ముందుకు దూసుకు వెళ్తోంది.  

star maa  kartikadeepam telugu serial created a national record
Author
Hyderabad, First Published Sep 27, 2020, 4:02 PM IST


టీవిలో పోటీ పోగ్రామ్ లు రన్ అవుతున్నాయి. ఓ ప్రక్కన కింగ్ నాగార్జున బిగ్ బాస్ పోగ్రామ్..క్రికిట్ ప్రియుల .. ఐపీఎల్.. కొత్త సినిమాలు డైరక్ట్ రిలీజ్ లు. కానీ.. ఇవేవీ వంటలక్క కు బ్రేక్ లు వేయలేకపోతున్నాయి. కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు నెంబర్ వన్ పొజీషన్ అందరినీ, అన్నటినీ నెట్టి ముందుకు దూసుకు వెళ్తోంది.  

తాజాగా కార్తీకదీపం సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం జాతీయ స్థాయిలోనే అత్యధిక రేటింగ్స్ సాధించిన సీరియల్‌గా నిలిచింది. ఈ సీరియల్ ను మొత్తం 4.2 కోట్ల మంది చూస్తున్నారని అఫీషియల్ గా ప్రకటించారు. అందుకే టీఆర్పీ రేటింగ్ 20.7 గా నమోదు అయింది. ఈ రేంజి రేటింగ్ సాధించిన సీరియల్ ఇండియాలో ఇదొక్కటే అని స్టార్ మా చెబుతోంది. ఈ టీవి సీరియల్ ముందు మిగతవాన్ని పడుకున్నాయనే చెప్పాలి. 

ఇక కార్తీక దీపం సీరియల్ ఇంతలా హిట్ అవటానికి కారణం...ఇది మళయాళంలో సూపర్ హిట్ అయిన సీరియల్ కరుత ముతు రీమేక్. ఆసియానేట్ లో ప్రసారం అయ్యింది.  ఆ సీరియల్ లో హీరోయిన్ గా చేస్తున్న ప్రేమీవిశ్వనాద్ తెలుగులోనూ హీరోయిన్ దీపగా చేస్తోంది. ఇక ఈ సీరియల్ ఇప్పటివరకూ తమిళం, కన్నడం, మరాఠీ భాషల్లో కూడా రీ మెక్ అయి ప్రసారం అవుతోందంటే అర్దం చేసుకోండి ఈ స్దాయిలో ఈ కథా బలం ఉందో. ఏదైమైనా ఒక తెలుగు సీరియల్ జాతీయస్థాయిలో హిందీ సీరియళ్ళను డామినేట్ చేసి మరీ అత్యధికంగా టీఆర్పీ రేటింగులు సాధించడం గ్రేటే కదా! ఈ సీరియల్ తో స్టార్ మా టీవీ కూడా ఇప్పుడు తెలుగు ఎంటర్తైన్మెంట్ ఛానెల్స్ లో టాప్ గా నిలబడింది.

Follow Us:
Download App:
  • android
  • ios