Asianet News TeluguAsianet News Telugu

సింగర్ అవతారం ఎత్తిన ఆలియా భట్, లైవ్ లో తెలుగు పాట పాడి.. అందరిని ఆశ్చర్యపరిచిన బ్యూటీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సింగర్ అవతారం ఎత్తింది. గాన కోకిలలా అద్భుతమైన పాట పాడి వినిపించింది. అది కూడా తన మాతృభాష హిందీలో కాదు. అచ్చ తెలుగు లో ...అందమైన పాట పాడింది. బ్రహ్మస్త్ర ప్రెస్ మీట్ దీనికి వేదికగా మారింది. 

Star Heroin Alia Bhatt Sings bramhastra Song
Author
First Published Sep 3, 2022, 11:37 AM IST


ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్రహ్మాస్త్ర ఫీవర్ నడుస్తోంది. వచ్చే వారం రిలీజ్ కాబోతున్న ఈసినిమా ప్రమోషన్స్ లో టీమ్ బీజీ బిజీగా ఉన్నారు. దేశమంతా తిరుగుతూ బ్రహ్మాస్త్రాను గ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇక సౌత్ లో ఈసినిమాను రాజమౌళి సమర్పిస్తుండటం, ఈ సినిమాలో కింగ్ నాగార్జున నటించడంతో.. ఇక్కడ కూడా ఈసినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్ నిన్న (02 సెప్టెంబర్ ) నైట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వెంట్ లో అందరిని ఆశ్చర్య పరుస్తూ ఆలియా భట్ కాసేపు సింగర్ అవతారం ఎత్తింది. ఆలియా తన గాత్రంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. మల్టీ టాలెంటెడ్ అయిన ఆలియా లైవ్ లోనే బ్రహ్మస్త్ర పాట పాడి వినిపించింది. అది కూడా హిందీలో కాదు.. తెలుగులో కుంకుమలా పాటను చాలా అందంగా ఆలపించింది. 

తన స్పీచ్ ను తెలుగు పాటతో క్లోజ్ చేస్తానని ముందుగానే  చెప్పిన ఆలియా భట్ .. అనుకున్నట్టుగానే పాట పాడారు.  అంతే కాదు తాను ఈ పాటను బాగా ప్రిపేర్ అయి వచ్చానని  కూడా వెల్లడించింది ఆలియా. ఇక ఆమె పాట పాడటం స్టార్ట్ చేయగానే అక్కడ ఉన్న మీడియావారితో పాటుగా.. అతిథులు అంతా ఆశ్చర్యపోయారు. భర్త రణ్ బీర్ అయితే తననే చూస్తుండిపోయాడు. ఇక బ్రహ్మాస్త్రా సినిమా కోసం ఈ పాటను చంద్రబోస్ రాశారు. సినిమాలో  ఈ పాటను సినిమాలో సిధ్ శ్రీరామ్ పాడారు. 

 

 

ఆలియా పాడిన ఈ పాటకు అంతా ఫిదా అయ్యారు. నిజంగా బ్రహ్మాస్త్రాలో ఫీమెల్ వెర్షన్ లో ఈ పాట ఉంటే.. ఇలానే ఉంటుందేమో అటూ.. పాజిటీవ్ కామెంట్స్ ఇచ్చారు. అంతే కాదు.. భాష సరిగ్గా రాకపనోయినా... తెలుగులో తొలిసారి, అది కూడా ఎంతో అందంగా పాట పాడిన ఆలియా భట్ పై నెట్టింట్ల  ప్రశంసల వర్షం కురుస్తోంది.  

ఆర్ఆర్ఆర్ సినిమాతో సీత పాత్రలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది..  బాలీవుడ్  బ్యూటీ  ఆలియా భట్.  సీత పాత్రలో అద్భుతమైన నటన చూపించి అందరిని  మెప్పించింది. ఇక  ఇప్పుడు  బ్రహ్మాస్త్ర సినిమాతో  మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మరో విశేషం ఏంటీ అంటే..  ఆలియా భట్ తన  భర్త రణ్‌బీర్ కపూర్ తో కలిసి నటించడం. వారి పెళ్ళి తరువాత ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ కాబోతున్న సినిమా ఇదే కావడం. ఇక వీరితో పాటు  అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్  ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. .

ఈ నెల 9న రిలీజ్ కాబోతోంది బ్రహ్మాస్త్ర.. కాగా ప్రమోషన్ లో భాగంగా తెలుగు ఆడియన్స్ కోసం టీమ్ రామోజీ ఫిల్మ్ సిటీలో  ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసింది.  కాని కొన్ని కారణాల వల్ల పోలీస్ పర్మీషన్ రాకపోవడంతో ఈ ఈవెంట్ రద్దయింది. దాంతో అప్పటికప్పుడు  మీడియా సమావేశం  నిర్వహంచారు టీమ్. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్, రాజమౌళీ పాల్గొన్నారు. వారితో పాటు  రణ్‌బీర్ , ఆలియా, నాగార్జున, మౌనీరాయ్, నిర్మాత కరణ్ జోహార్  కూడా పాల్గోన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios