Asianet News TeluguAsianet News Telugu

సుకుమార్ తో సినిమా ఉన్నట్టా..? లేనట్టా..? క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ

పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.  లైగర్ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కంటే ముందు రెండు సినిమాలు ప్రకటించాడు విజయ్. అందులో శివ నిర్వాణతో సినిమా ఆల్ రెడీ స్టార్ట్ చేసేశాడు. కాని సుకుమార్ తో చేస్తానన్న సినిమా పరిస్థితి ఏంటీ...? ఆల్ రెడీ అనౌన్స్ మెంట్ ఇచ్చిన ఈమూవీ ఇప్పుడు ఉన్నట్టా..? లేనట్టా..?
 

Star Hero Vijay Devarakonda Clarity About Sukumar movie
Author
Hyderabad, First Published Aug 21, 2022, 6:44 AM IST

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్  ప్రమోష‌న్ల‌లో బిజీగా ఉన్నాడు. రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు టీమ్. అంతకు ముందు నుంచి  అనన్య పాండేతో కలిసి విజయ్ దేవరకొండ లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇండియా టూర్ పేరుతో ప్ర‌తి రాష్ట్రంలో పెద్ద నగరాలను టార్గెట్ గా పెట్టుకునిప్రమోషన్ ఈవెంట్స్ చేస్తున్నాడు. అక్కడక్కడ  ప్రెస్‌మీట్‌ల‌ు నిర్వ‌హించి  లైగర్ సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నాడు. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ  సినిమా ఆగ‌స్టు 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్  కానుంది. 

అయితే లైగర్ తో బాలీవుడ్ కు చేరబోతున్న విజయ్ దేవరకొండ .. అంతకు ముందు రెండు సినిమాలు కమిట్ అయ్యాడు.. అందులో శివ నిర్వాణతో సినిమా మొదలెట్టాడు కూడా.. అయితే అంతకంటే ముందు సుకుమార్ తో సినిమా అనౌన్స్ చేశారు. కాని ఈసినిమా గురించి ఇ్పటి వరకు ఎటువంటి మాట లేదు. ..ఈ క్ర‌మంలో లైగ‌ర్ ప్రమోషన్స్ లో భాగంగా.. తన సినిమాల గురించి మాట్లాడుతూ..  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సుకుమార్‌తో చేయ‌బోయే సినిమా గురించి కూడా  స్పందించాడు.

సుకుమార్ డైరెక్షన్ లో  విజయ్ దేవరకొండ సినిమా అంటూ...గతంలోనే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఫాల్క‌న్ క్రియేష‌న్స్ ఈ సినిమాను నిర్మించ‌నున‌ట్లు 2020లోనే ప్ర‌క‌టించారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దాంతో సినిమా ఆగిపోయింది అని అందరూ అనుకున్నారు. కాని ఈసినిమా ఆగిపోయిందా..? లేకా ఇంకేమైనా ప్రాబ్లమా ..? అలే విషయంలో  తాజాగా విజ‌య్ స్పందించాడు. సుకుమార్‌తో సినిమా లేట్ అవుతుంది.. అది నిజమే.. కాని ఈసినిమా ఆగిపోలేదు. దానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపాడు. అంతేకాకుండా సుక‌మార్ ప్ర‌స్తుతం పుష్ఫ‌-2తో బిజీగా ఉన్నాడ‌ని, ఈ మూవీ  పూర్తి కాగానే త‌మ సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని క్లారిటీ ఇచ్చాడు. 

ఇక ఈ విషయం విన్న రౌడీ హీరో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. .లైగ‌ర్ చిత్రంతో విజ‌య్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాపై మన దగ్గర కంటే.. నార్త్ లోనే ఎెక్కువ అంచనాలు ఉన్నాయి. ఇప్ప‌టికే విజ‌య్‌పై నార్త్‌లో విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఇక లైగర్ మూవీ హిట్ పడితే..విజయ్ క్రేజ్ అమాంతం పైకి ఎక్కేస్తుంది. బాదలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా రౌడీ హీరోతో సినిమాలు చేయడానికి పోటీ పడతారు. అంతే కాదు  చిత్రంతో బాలీవుడ్ స్టార్ హీరోల‌కు స‌మానంగా విజ‌య్ క్రేజ్ పెరుగుంది. ఇక లైగర్ సినిమా విషయానికి వస్తే.. ముంబైలోని ఛాయ్ వాలా ప్ర‌పంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది. విజ‌య్‌కు జోడీగా అనన్య‌పాండే హీరోయిన్‌గా న‌టించింది. క‌ర‌ణ్‌జోహ‌ర్‌, ఛార్మీతో క‌లిసి పూరి స్వీయ నిర్మాణంలో లైగర్ ను రూపొందించారు. ఇక ప్రపంచ బాక్స‌ింగక దిగ్గజం  మైక్ టైస‌న్ కీల‌కపాత్ర‌లో న‌టించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios