Asianet News TeluguAsianet News Telugu

లైఫ్ ఇచ్చాడని ఛాన్స్ ఇస్తే.. నిండా ముంచేశాడు: స్టార్ హీరో బాధలు!

ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో హీరోగా తనకు బ్రేక్ ఇచ్చాడనే కారణంతో ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ కి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు స్టార్ హీరో

star hero upset with movie output
Author
Hyderabad, First Published Sep 3, 2018, 3:20 PM IST

ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో హీరోగా తనకు బ్రేక్ ఇచ్చాడనే కారణంతో ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ కి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు స్టార్ హీరో. ఆ డైరెక్టర్ ని హీరోలు నమ్మడం మానేసి చాలా కాలమైంది. పైగా ఈ స్టార్ హీరో కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేసినా.. సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి సరైన రెస్పాన్స్ రాకపోవడం, సినిమా రషెస్ కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో స్టార్ హీరో దిగులు చెందుతున్నాడని సమాచారం. సినిమా రిజల్ట్ పై అనుకున్న విధంగా రాదేమోననే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాడట.

నమ్మి ఛాన్స్ ఇస్తే నిండా ముంచేశాడంటూ సదరు డైరెక్టర్ గురించి సన్నిహితుల వద్ద చెప్పి వాపోతున్నాడట. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్ సినిమాలు అందుకున్న ఈ హీరో మూడో ఫ్లాప్ కి కూడా సిద్ధమై ఉన్నట్లు టాక్. కనీసం ఈ సినిమాతో అయినా.. తన కెరీర్ గాడిలో పెట్టుకుంటాడనుకుంటే ఈసారి కూడా నమ్మకాన్ని పోగొట్టుకున్నాడంటూ సదరు డైరెక్టర్ పై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios