Asianet News TeluguAsianet News Telugu

సరికొత్త అవతారంలో సూర్య, 42వ సినిమా నుంచి సర్ ప్రైజ్ మోషన్ పోస్టర్ రిలీజ్

డిఫరెంట్ స్టోరీస్ ను తీసుకుంటూ.. వరుస సినిమాలతో.. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఆయన 42వ సినిమాకు సబంధించి బిగ్ అప్ డేట్ ఇచ్చేశాడు. 

Star Hero Surya 42 Movie Motion Poster Release
Author
First Published Sep 9, 2022, 12:05 PM IST

వర్సటైల్ స్టార్ సూర్య హీరోగా.. విలక్షణ దర్శకుడు శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా స్టార్ట్ అయ్యింది. యూవి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి బిగ్ అప్ డేటన్ ను ఇచ్చారు మేకర్స్ ఈ సినిమా నుంచి సూర్య మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అంతే కాదు ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టు అనౌన్స్ చేశారు. విలక్షణ నటనతో తమిళంతో పాటు.. తెలుగులో కూడా  తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ ను.. ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు హీరో సూర్య. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న మాస్..  కమర్షియల్ సినిమాలతో దూసుకుపోతున్న  శివ కాంబినేషన్‌లో ఈ సినిమా చేస్తున్నారు సూర్య. 

సూర్య ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈసినిమా  మోషన్ పోస్టర్.. వేరే లెవల్లో ఉంది. ఉహించని విధంగా అద్భుతమైన విజువల్స్ తో ఈ  వీడియోను డిజైన్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ కు హైలెట్  దేవీశ్రీ ప్రసాద్.. బీజీఎం అని చెప్పాలి. ఒక రకంగా ఈ వీడియోతో  పాత డీఎస్పీని గుర్తుకుతెచ్చింది. భారీ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వీడియో చూస్తే అర్థమవుతోంది. పాన్ ఇండియా అంటూ ఐదు భాషల్లో అందరూ రిలీజ్ చేస్తుండగా.. ఇప్పుడు సూర్య 42 ప్రాజెక్టుని ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

 

ఈసినిమాలో డిఫరెంట్ గెటప్ లో సూర్య కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సూర్య లుక్ ను బ్యాక్ నుంచి చూపించారు. అంతే కాదు అట్మాస్పియర్ చూస్తే.. హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ తో.. భారీ యుద్దాల కలయికతో సినిమా తెరకెక్కబోతున్నట్టు అనిపిస్తోంది. మరి ఈసినిమా షూటింగ్ టైమ్ లోనే ఇంత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ముందు ముందు అప్ డేట్స్ ఎలా ఉంటాయి.. సినిమా రిలీజ్ అయితే ఎలాంటి రిజల్ట్ సాధిస్తుంది అని సూర్య ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 

భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌తో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదటి నుంచి కమర్షియల్ తో పాటు వినూత్నమైన కథలను ఎన్నుకుంటూ.. మిర్చి, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, బాగమతి లాంటి ఎన్నో విజయాలతో అగ్ర నిర్మాణ సంస్థగా నిలిచింది యూవీ క్రియేషన్స్. తమిళ స్టార్ హీరో సూర్య, అగ్ర దర్శకుడు శివ కాంబినేషన్‌లో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ నెం 25గా యువి క్రియేషన్స్‌తో సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టుకు ముహూర్తం పెట్టారు. ఇక ఈ సినిమా షూటింగ్  కూడా స్టార్ట్ అయ్యింది.  చిత్ర యూనిట్‌తో పాటు అతిరథ మహారధుల సమక్షంలో ఓపెనింగ్ జరిగింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios