టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతోన్న రామ్ చరణ్ కోట్ల ఆస్తికి అధిపతి. ఓ నేషనల్ న్యూస్ ఛానెల్ చేసిన సర్వే ప్రకారం.. రామ్ చరణ్ ఆస్తి విలువ రూ.1300 కోట్లకు పైగానే అని సమాచారం.

అయితే చరణ్ కి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ తో తన అభిరుచికి తగ్గట్లుగా చరణ్ ఒక ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ ఇంటి విలువ రూ.38 కోట్లని తెలుస్తోంది. ఇంట్లో ప్రతీ వస్తువు ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇంటీరియర్ డెకరేషన్ కి ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

సౌత్ ఇండియాలో ఉన్న సెలబ్రిటీలలో చరణ్ నిర్మించిన ఈ ఇల్లు అత్యంత ఖరీదైన ఇల్లుగా చెబుతున్నారు. నటనతో పాటు చరణ్ పలు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు.  ఉపాసనని వివాహం చేసుకున్న తరువాత అపోలో హాస్పిటల్స్ లో స్టేక్ హోల్డర్ గా ఉన్నాడు. 

ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో 'RRR'అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ అలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారని సమాచారం.