ఈ ముగ్గురు బడా దర్శకుల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఆశ్చర్యపోతారు!
రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, పూరి జగన్నాధ్.. వీరు దేశం మెచ్చిన దర్శకులు. ట్రెండ్ సెట్టర్స్. ఈ ముగ్గురు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని సినిమా ప్రేమికుడు ఉండడు. శివ మూవీతో డైరెక్షన్ లో కొత్త పంథా పరిచయం చేశాడు. కెరీర్ బిగినింగ్ లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఒక్కో చిత్రం ఒక ఆణిముత్యం. ఎలాంటి ఫేమ్ లేని జేడీ చక్రవర్తితో సత్య తెరకెక్కించి బాలీవుడ్ లో హిట్ కొట్టాడు. సత్య ఒక్కరోజు కూడా ఆడదని ప్రీమియర్స్ చూసిన బాలీవుడ్ పెద్దలు అన్నారట. ఇప్పటికీ సత్య అంటే ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. రంగీలా, సర్కార్ వంటి బ్లాక్ బస్టర్స్ ఆయన దర్శకత్వంలో తెరకెక్కాయి.
ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అపజయం ఎరుగని దర్శకుడు. ఆయన రికార్డ్స్ ఆయన బ్రేక్ చేయాల్సిందే. మరొక దర్శకుడి వల్ల కాదు. బాహుబలితో పాన్ ఇండియా కాన్సెప్ట్ ఇండియాకు పరిచయం చేశాడు. సినిమాలో విషయం ఉంటే... అన్ని భాషల వాళ్ళు చూస్తారు. వేల కోట్ల వసూళ్లు సాధ్యమే అని నిరూపించాడు. ఏకంగా ఇండియన్ సినిమాకు ఆస్కార్ తెచ్చాడు.
టాలీవుడ్ కి చెందిన మరొక టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, పూరి కథలు చాలా కొత్తగా ఉంటాయి. ముఖ్యంగా ఆయన రాసే హీరో క్యారెక్టరైజేషన్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం, బద్రి, ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి.. పూరి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాలు. ఇక పోకిరితో ఇండస్ట్రీని షేక్ చేశాడు. మహేష్ పాత్రను పూరి తీర్చిదిద్దిన తీరు అద్భుతం.
కాగా రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, రాజమౌళి సక్సెస్ ఫుల్ దర్శకులు కాగా... వీరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అది ముగ్గురు నాస్తికులు. వీరికి దేవుడి మీద నమ్మకం ఉండదు. మా అమ్మ నాన్నలకు భక్తి ఎక్కువ. నాకు ఉండదు. అమ్మ ఉన్నప్పుడు ఆమె కోసం గుడికి వెళుతూ ఉండేవాడినని రాజమౌళి ఓ సందర్భంలో చెప్పారు. ఇక పూరి జగన్నాధ్... నాకు పనే దైవం అంటారు. నాకు పని లేనప్పుడు దేవుడు గుర్తొస్తాడు. పని చేసుకునేవాడికి దేవుడి అవసరం లేదు అంటారు. రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వెరీ ప్రాక్టికల్. ఎమోషన్స్, నమ్మకాలు అనేవి ఉండవు. భౌతిక విషయాలను మాత్రమే నమ్ముతాడు ...