.ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రాజమౌళి (SS Rajamouli)ఓ గెస్ట్ రోల్ లో కనపడనున్నారనే టాక్‌ ఇప్పుడు ట్రేడ్ ను షేక్‌ చేస్తోంది. అది ఓ ప్రత్యేకమైన పాత్ర అని, ఎవరు చేస్తే బాగుంటుందని  ప్రభాస్ తో చర్చిస్తే రాజమౌళి అయితే బాగుంటుందని సూచించటం, 


నాగ్‌ అశ్విన్‌ - ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)పై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్‌ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన చిన్న అప్‌డేట్‌ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరలవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేమిటంటే...ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రాజమౌళి (SS Rajamouli)ఓ గెస్ట్ రోల్ లో కనపడనున్నారనే టాక్‌ ఇప్పుడు ట్రేడ్ ను షేక్‌ చేస్తోంది.

అది ఓ ప్రత్యేకమైన పాత్ర అని, ఎవరు చేస్తే బాగుంటుందని ప్రభాస్ తో చర్చిస్తే రాజమౌళి అయితే బాగుంటుందని సూచించటం, నాగ్ అశ్విన్ వెళ్లి కలిసి విషయం చెప్పి ఒప్పించటం జరిగిందని అంటున్నారు. త్వరలోనే రాజమౌళికి చెందిన షూట్ జరుగుతుందని అంటున్నారు. అయితే మరికొంతమంది అలాంటిదేమీ లేదు కేవలం ‘కల్కి’ డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌కు కూడా రాజమౌళి సలహాలు ఇస్తున్నారని అంటున్నారు. ఏదైమైనా రాజమౌళి ఈ ప్రాజెక్టుతో లింక్ అవటం మాత్రం హాట్ టాపిక్కే. నిజమే కాదా అనేది తెలియాలంటే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే ‘కల్కి’ గ్లింప్స్‌ వచ్చినప్పుడు చిత్ర టీమ్ ని ప్రశంసిస్తూ రాజమౌళి చేసిన ట్వీట్‌ ఎంత సెన్సేషన్‌ సృష్టించిందో తెలిసిందే.

ఇక ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌ కూడా నటించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘అలాంటి విషయాలు మేకర్స్‌ మాత్రమే చెప్పాలి’ అంటూ స్పందించారు. ఈ సినిమాలో ఇప్పటికే ఎంతో మంది ఇతర భాషలకు చెందిన నటీనటులు ఉన్నారు.ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) సరసన బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా.. సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ విలన్‌ (Kamal Haasan)గా కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన దీని గ్లింప్స్‌ వీడియోకు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.