స్టార్ డైరెక్టర్ జక్కన్న నటుడిగా మారారు.. అంతే కాదు ఓ ఫేమస్ ఫోన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా రాజమౌళి మారిపోయారు. దానికి సబంధించిన యాడ్ లో .. స్టార్స్ ను మించి నటించేశారు రాజమౌళి.
దర్శకుడిగా టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేశారు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగు సినిమాకు ఆస్కార్ రేంజ్ వచ్చేలా చేసిన జక్కన్న.. తన సినియాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే వన్నె తీసకువచ్చాడు. మన తెలుగు హీరోలను గ్లోబల్ స్టార్స్ గా మారుస్తూ.. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా సినిమాలు చేస్తున్న జక్కన్నను ప్రపంచ దిగ్గజ దర్శకులే శభాష్ అన్నారు. తెలుగు వారిని ఆస్కార్ వరకు తీసుకువెళ్లిన ఈ దర్శకధీరుడిని ఇప్పుడు ప్రపంచం మొత్తం గమనిస్తుంది.
ఇక ఇంత సాధించిన రాజమౌళిపై కన్నేయకుండా ఉంటాయా కంపెనీలు.. కొన్ని కంపెనీలు రాజమౌళి ఫేమ్ ని తమ ప్రాడెక్స్ కోసం వాడుకోవాలి అని పక్కాగా ప్లాన్ చేసుకున్నాయి. జక్కన్న ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఫోన్ కంపెనీ ఒప్పో (Oppo).. రాజమౌళిని తమ బ్రాండ్ అంబాసడర్ గా ప్రకటించింది. అంతే కాదు వెంటనే ఓ యాడ్ ఫిల్మ్ కూడా చేసి.. సోషల్ మీడియాలో కి వదిలేశారు టీమ్.
ఇక ఓప్పో నుంచి వచ్చిన బెస్ట్ న్యూ ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం రాజమౌళితో ఓ యాడ్ ని కూడా షూట్ చేశారు. ఇక తాజాగా ఈ యాడ్ ని రాజమౌళి తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ యాడ్ లో ఒక వ్యక్తి ఫోన్ తో ఫోటో తియ్యడానికి ట్రై చేస్తుంటే.. రాజమౌళి తనకి కరెక్ట్ ఫ్రేమ్ సెట్ చేసి ఇస్తాడు. ఆ ఫ్రేమ్ తో ఫోటో తియ్యగానే ఫోటో తీసిన వ్యక్తి రాజమౌళిలా మారిపోతాడు. అలాగే రాజమౌళి మరొకరికి కూడా ఐడియా ఇవ్వగా వారు కూడా జక్కన్నలా మారిపోతారు. ఇక ఎటు చూసినా రాజమౌళి మాత్రమే కనిపనిస్తుంటాడు.
ఈ యాడ్ చూసి అద్భుతంగా ఉంది అంటున్నారునెటిజన్లు. స్టార్స్ ను డైరెక్ట్ చేసే జక్కన్నను డైరెక్ట్ చేసి మరీ.. ఇంత అద్భుతమైన అవుట్ పుట్ రాబట్టిన ఆ దర్శకుడు ఎవరు అంటూ కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. అంతే కాదు రాజమౌళినే స్వయంగా ఈ యాడ్ ఫిల్మ్ చసి ఉంటాడు అని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. ఎవరు చేసినా..? యడ్ ఫిల్మ్ లో మాత్రం జక్కన్న మార్క్ పక్కాగాకనిపిస్తోంది. ఈ యాడ్ వీడియో సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంద.ి
