మగబిడ్డకు జన్మనిచ్చిన అట్లీ భార్య, ఎమోషనల్ పోస్ట్ పెట్టిన స్టార్ డైరెక్టర్
తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు అట్లీ.. ఇంతకీ అట్లీ ఏమంటున్నాడంటే..?

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తండ్రి అయ్యాడు. తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు దర్శకుడు. దేవుడి ఆశీర్వచనంతో.. బేబీ బాయ్ వచ్చాడని.. తన కోసం తన భార్య ప్రియా అట్లీ అద్భుతమైన కానుకనందించిందంటూ పోస్ట్ చేశాడు అట్లీ. ఈ పోస్ట్ తో పాటు అట్లీ ఓ ఫోటోను కూడా శేర్ చేశాడు అట్లీ. సోషల్ మీడియాలో అట్లీ పోస్ట్ చూసిన నెటిజన్లు ఫాస్ట్ గా స్పందిస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా అట్లీ కుమార్, నటి కృష్ణ ప్రియను 2014లో ప్రేమ వివాహాం చేసుకున్నాడు. పెళ్ళయిన 8ఏళ్ల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. గతంలో కూడా బేబి బంప్‌తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ.. మేము ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి అంటూ పోస్ట్ చేశారు. అప్పుడు కూడా పలువురు సెలబ్రిటీలు దీనిపై స్పందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఏ.ఆర్ మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అట్లీ.. ఆయన నిర్మాణ సంస్థలోనే తన మొదటి సినిమాగా రాజారాణి ని తెరకెక్కించాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అవ్వడంతో.. ఆ వెంటనే వరుస సినిమాలు రూపొందించాడు. విజయ్‌తో తేరీ మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో సౌత్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. వీటి తర్వాత వరుసగా విజయ్‌తోనే మెర్సల్, బిగిల్ వంటి సినిమాలను డైరెక్ట్ చేసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారిపోయాడు అట్లీ. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో జవాన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 2న రిలీజ్ కానుంది.
ఇక అట్లీ భార్య ప్రియా కొన్ని తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రియా నటించి తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. నా పేరు శివ, యముడు లాంటి సినిమాల్లో ప్రియా నటించింది. ప్రస్తుతం సినిమాలు తగ్గించింది. ఇక ముందు సినిమాలు చేస్తుందో లేదో క్లారిటీ లేదు.