బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ లాక్ అప్ పేరుతో  సరికొత్త రియాలిటీ షోకి సిద్ధం అవుతున్నారు. ఈ షోలో ప్రముఖ కమెడియన్ వీర్ దాస్ పాల్గొంటున్నారని వార్తలు వస్తుండగా... ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

డిజిటల్ కంటెంట్ విపరీతమైన ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో స్టార్స్ నయా ఆలోచనలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా రియాలిటీ షోలు, టాక్ షోల ట్రెండ్ ఊపందుకుంది. నటసింహం బాలయ్య (Balakrishna)అన్ స్టాపబుల్ షో అన్ బిలీవబుల్ సక్సెస్ అందుకుంది. నిజంగానే బాలయ్య అందరి థింకింగ్ మార్చేశాడు. వరల్డ్ రికార్డులు నెలకొల్పిన అన్ స్టాపబుల్ షో ఓ సంచలనం అని చెప్పాలి. ఆయన స్పూర్తితో ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranauth)ఓ రియాలిటీ షోకి సిద్ధమయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా జరిగింది. 

నిర్మాత ఏక్తా కపూర్ తో చేతులు కలిపిన కంగనా లాక్ అప్ (Lock Upp)పేరుతో రియాలిటీ షో నడపనున్నారు. ఈ షోకి ఆమె హోస్ట్ కాగా.. షో చాలా అడ్వెంచరస్ గా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఏ ఎల్ టి బాలాజీ, ఎం ఎక్స్ ప్లేయర్ లో ఈ షో ప్రసారం కానుంది. కాగా ఈ షోలో ప్రముఖ కమెడియన్ వీర్ దాస్ పాల్గొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుస కథనాల నేపథ్యంలో వీర్ దాస్ స్పందించారు. ప్రచారం జరుగుతున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని తేల్చిపారేశారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ షో కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. అలాగే నాకు ఆసక్తి కూడా లేదు. కంగనా రనౌత్ టీమ్ కి నా బెస్ట్ విషెష్... అని ట్వీట్ చేశారు. అలాగే సదరు వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై సెటైర్లు పేల్చాడు. 

వీర్ దాస్ (Vir Das)ట్వీట్ తో ఓ క్లారిటీ వచ్చింది. ఇక లాక్ అప్ రియాలిటీ షో 72 ఎపిసోడ్స్ గా ప్రసారం కానుంది. మొత్తం 16 మంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు. వీరందరినీ జైలు గదుల్లో ఉంచుతారని సమాచారం. ఇక ఈ షో ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ కి కంగనా రనౌత్ ఛాలెంజ్ విసిరారు. మీలాంటి అల్లాటప్పా షో కాదని, లాక్డ్ అప్ మామూలుగా ఉండదంటూ సల్మాన్ ని రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. ఇక ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ కి భారీగానే పారితోషికం అందిస్తున్నారని సమాచారం. ఫిబ్రవరి 27 నుంచి లాక్ అప్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. 

Scroll to load tweet…

ఇక కొన్నాళ్లుగా కంగనా లేడీ ఓరియెంట్ చిత్రాలు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తలైవి గత ఏడాది విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో ఈ మూవీ విడుదలైంది. ప్రస్తుతం ధాకడ్ పేరుతో తెరకెక్కుతున్న ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. అలాగే తేజాస్ అనే మరో మూవీలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. నిర్మాతగా కూడా మారిన కంగనా టికు వెడ్స్ షేరు అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.