'జబర్దస్త్' కామెడీ షోకి బ్రహ్మీ చెక్ పెట్టనున్నాడా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 23, Aug 2018, 2:17 PM IST
star comedian brahmanandam to host comedy show
Highlights

కొన్నేళ్ల పాటు బ్రహ్మానందం లేని స్టార్ హీరో సినిమా ఉండేది కాదు. ఆయన డేట్స్ కోసం హీరోలు కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. అప్పట్లో ఆయన క్రేజ్ అలా ఉండేది

కొన్నేళ్ల పాటు బ్రహ్మానందం లేని స్టార్ హీరో సినిమా ఉండేది కాదు. ఆయన డేట్స్ కోసం హీరోలు కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. అప్పట్లో ఆయన క్రేజ్ అలా ఉండేది. బ్రహ్మీ కోసం సెపరేట్ గా కామెడీ ట్రాక్ లు రాసేవారు రైటర్లు. సినిమాల సక్సెస్ లో బ్రహ్మి కీలకపాత్ర పోషించేవాడు. తన కామెడీ టైమింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ని నవ్వించేవాడు. కానీ రాను రాను అతడి క్రేజ్ బాగా తగ్గిపోయింది.

ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల్లో కనీస ప్రాముఖ్యత లేని పాత్రల్లో కనిపించాడు. ఇక ఫేడవుట్ అయిపోయాడనుకున్న ఈ యాక్టర్ తో ప్రముఖ ఛానెల్ వారు ఓ షో మొదలుపెడుతుండడం విశేషం. ఇప్పటివరకు వెండితెరపై నవ్వులు పూయించిన బ్రహ్మానందం ఇప్పుడు బుల్లితెరపై నవ్వులు పంచడానికి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ బుల్లితెరపై సరికొత్త షోలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఓ కామెడీ షో చేయడానికి రెడీ అయింది. తెలుగులో కామెడీ కింగ్ అయిన బ్రహ్మానందం హోస్ట్ గా ఈ కార్యక్రమం జరగాఉంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇప్పటివరకు కామెడీ షోలలో నెంబర్ వన్ గా నిలిచిన 'జబర్దస్త్' షోకి బ్రహ్మీ కామెడీతో చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ షోని నిర్వహించనున్నారని టాక్. మరి బ్రహ్మీ కామెడీ షో ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి! 

loader