టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కి హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు . రీసెంట్ గా తమన్నా హీరోయిన్ గా నటించిన 'నెక్స్ట్ ఏంటి?' సినిమాలో సందీప్ హీరోగా నటించాడు. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు కానీ సినిమా నిరాశ పరిచింది.

కానీ సందీప్ కి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఇటీవలే 'తెనాలి రామకృష్ణ' అనే సినిమాను మొదలుపెట్టాడు సందీప్. జి.నాగేశ్వరరెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే కేవలం హీరో మీద ఆధారపడి సినిమా చేయకుండా చుట్టూ ప్యాడింగ్ కోసం పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లను రంగంలోకి దింపుతున్నాడు.

ముందుగా హీరోయిన్ గా హన్సికను ఫైనల్ చేశారు. సందీప్ పక్కన హన్సిక నప్పుతుందో లేదో పక్కన పెడితే ఇప్పటికీ ఆమెకి కోలివుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి సినిమాను అక్కడ మార్కెట్ చేసుకోవచ్చు. అలానే హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ని ముఖ్య పాత్ర కోసం తీసుకున్నారు.

కోలివుడ్ తో పాటు ఈ మధ్య తెలుగులో కూడా వరలక్ష్మి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే ఒకప్పటి హీరోయిన్ భూమికని కూడా తీసుకున్నారు. వీరితో పాటు ఫేమ్ ఉన్న సీనియర్ నటీనటులను ఈ ప్రాజెక్ట్ లో భాగం చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.