స్టార్ యాంకర్ గా బుల్లితెరపై మెరుపులు మెరిపిస్తున్న అనసూయ (Anasuya)నటిగా ఫుల్ బిజీ అయ్యారు. ఆమెకు వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి. పేపర్ బాయ్ మూవీ ఫేమ్ జయ శంకర్ దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ తెరకెక్కుతుండగా అనసూయ ప్రధాన పాత్ర చేస్తున్నారు.  


‘పేపర్ బాయ్’ఫేమ్‌ జయశంకర్‌ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్‌ కాన్సెఫ్ట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్‌ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. సాయికుమార్‌, వైవా హర్ష, అక్ష పర్థసాని, శ్రీనివాస్‌ రెడ్డి, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అనుప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాత శేషు మారంరెడ్డి మాట్లాడుతూ...జయశంకర్‌ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని కొనియాడారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్‌ పూర్తయిందని, మిగిలిన భాగాన్ని ఏప్రిల్‌లోపు కంప్లీట్‌ చేస్తామని చెప్పారు. శ్రీనివాస్‌ రెడ్డి, చమ్మక్‌ చంద్రకు సంబంధించిన సీన్స్‌ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడని, థియేటర్స్‌లో ఆ సీన్స్‌ తప్పకుండా నవ్వులు పూయిస్తాయని చెప్పారు. జయశంకర్‌ వర్కింగ్‌ స్టెల్‌ చాలా బాగుందని, అందుకే ఆయనతో మరో సినిమాను కూడా ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు. 

ఇక దర్శకుడు జయశంకర్‌ మాట్లాడుతూ.. నిర్మాతల ప్రోత్సాహంతో సినిమాను అద్బుతంగా తెరకెక్కిస్తున్నామని చెప్పారు. తమ చిత్రానికి అనూప్‌ సంగీతం చాలా ప్లస్‌ అవుతుందన్నారు. టైటిల్‌తో పాటు విడుదల తేదిని కూడా త్వరలోనే వెల్లడిస్తామని జయశంకర్‌ చెప్పుకొచ్చారు. కాగా, ఈ చిత్రానికి ‘గ్రహమ్‌’అని టైటిల్‌ ఖరారు చేసినట్లు సమాచారం.