Asianet News TeluguAsianet News Telugu

SSMB28 ఫస్ట్ లుక్ లో.. వైరల్ అవుతున్న మహేష్ బాబు షర్ట్... కాస్ట్ ఎంతో తెలుసా...?

సెలబ్రిటీలు ఏదైనా  కాస్త కాస్ట్లీగా బట్టలు వేసుకున్నా.. వస్తువులు వాడినా.. కార్లు కొన్నా.. నెటిజన్ల కళ్లన్నీ వాటిపైనే ఉంటాయి. తమ స్టార్స్ వాడేవస్తువులు ఇంత కాస్ట్ అంటూ వాటిని వైరల్ చేయడం.. ఫ్యాన్స్ కు బాగా అలవాటు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కూడా ఆయన ఫస్ట్ లుక్ లో వాడిన షర్ట్ ను వైరల్ చేస్తున్నారు. ఈ షర్ట్ ను ఆన్ లైన్ లో కొనే ప్రయత్నం చేస్తున్నారు. 

SSMB28 First Look Mahesh Babu Shart Cost Viral JMS
Author
First Published Mar 28, 2023, 3:50 PM IST

సెలబ్రిటీలు ఏదైనా  కాస్త కాస్ట్లీగా బట్టలు వేసుకున్నా.. వస్తువులు వాడినా.. కార్లు కొన్నా.. నెటిజన్ల కళ్లన్నీ వాటిపైనే ఉంటాయి. తమ స్టార్స్ వాడేవస్తువులు ఇంత కాస్ట్ అంటూ వాటిని వైరల్ చేయడం.. ఫ్యాన్స్ కు బాగా అలవాటు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కూడా ఆయన ఫస్ట్ లుక్ లో వాడిన షర్ట్ ను వైరల్ చేస్తున్నారు. ఈ షర్ట్ ను ఆన్ లైన్ లో కొనే ప్రయత్నం చేస్తున్నారు. 

స్టార్ హీరోలు ఏదైనా షర్ట్ వేసుకున్నా.. షూస్ కొనుక్కున్నా.. కొత్త కార్లలో షికార్లు చేస్తున్నా.. నెటిజన్ల  కళ్ళు వారిమిదనే ఉంటాయి. ముఖ్యంగా . ఫ్యాన్స్ కళ్ళన్నీ వాటిమీదే ఉంటాయి. వెంటనే వాటి గురించి ఇంటర్నెట్ లో  సెర్చ్ చేస్తూ..  కాస్ట్  ను వైరల్ చేస్తుంటారు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటూ.. వాటి బ్రాండ్స్ ను చెక్ చేసి.. సోషల్ మీడియాలో హైలెట్ చేస్తారు. తమకు కొనే స్థోమత ఉండి.. ఆన్ లైన్ షాపింగ్ లో అది దోరికితే వెంటనే ఆర్టర్ కూడా పెడుతుంటారు.  లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఇలానే మహేష్ షర్ట్ ను వైరల్ చేస్తున్నారు. 

స్టార్ హీరోలు వాడే షూస్.. డ్రసెస్.. వాచెస్, ఇలా ఏం వాడినా... అభిమానుల కళ్ళనుంచి మాత్రం తప్పించుకోలేదు. ఫ్యాన్స్ కు వాటి వివరాలు  ఇట్టే తెలిసిపోతుంది. టాప్ హీరోల సినిమాలోని మ్యానరిజమ్స్ ని మాత్రమే కాదు సదరు హీరోలు వేసుకున్న షర్ట్, ప్యాంట్, షూస్ లాంటి వాటిని బాగా ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ వేసుకున్న షర్ట్ ఫ్యాన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తోంది.  SSMB 28 లుక్  పోస్టర్ లో సూపర్ స్టార్  వేసుకున్న షర్ట్ చూసి ఫ్యాన్స్ తెగ ముచ్చట పడిపోతున్నారు. ధర కాస్త అటు ఇటుగా పెద్ద విచిత్రమేమి కాకపోయినా.. మహేష్ షర్ట్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. 

సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్నహ్యాట్రీక్ మూవీ షూటింగ్ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. . SSMB 28 వర్కటింగ్ టైటిల్ తో రూపోందుతున్న ఈసినిమా నుంచి  తాజాగా మహేష్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. అంతే కాదు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు టీమ్. ఈపోస్టర్ లో మహేష్.... స్టయిల్ గా సిగరెట్ తాగుతున్న మహేష్ లుక్స్ ఫ్యాన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది.  అదే టైంలో మహేష్ షర్ట్ కూడా పలువురిని ఆకర్షించింది.  దీంతో దాని కాస్ట్ ఎంతో తెలుసుకోవాలని ప్రయత్నించారు అభిమానులు . వెంటనే నెట్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. దాని డీటేయిల్స్ కూడా పట్టేశారు. 

ఈ షర్ట్  సూపర్ డ్రై కంపెనీకి చెందిన  చెక్ ఫ్లానెల్ షర్ట్.... దీని రేటు ఓన్లీ.. 3,299 మాత్రమే. కాస్త తక్కువ ధరకే వస్తుంది.. అందులోను సూపర్ స్టార్ మహేష్ వేసుకున్నాడు కాబట్టి.. వెంటనే తీసుకోవాలని అభిమానులు తెగ ట్రై చేస్తున్నారు. అందులోను  ఆన్ లైన్ లో అందుబాటులో ఉండటంతో.. మహేష్ అభిమానులు ఈ షర్ట్ ను బుక్ చేసుకుంటున్నారట. ఈ విషయం తెలిసి ఆన్ లైన్ లో ఈ షర్ట్ కోసం తెగ సెర్చ్ చేస్తుననారు అభిమానులు. 

Follow Us:
Download App:
  • android
  • ios