Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళి 400కోట్లు అప్పు చేస్తే... నిర్మాతలు ఏం చేస్తున్నారు?

'బాహుబలి' లాంటి సినిమా కోసం కూడా రూ.300 నుంచి రూ.400 కోట్ల రూపాయలను ఆ వడ్డీ రేటుకి తీసుకువచ్చారు" అని రానా వెల్లడించాడు.

SS Rajamouli Borrowed A Whopping 400 Crores?
Author
First Published Jun 3, 2023, 1:46 PM IST


బాహుబలి సినిమా కోసం 420 కోట్లు అప్పు చేశానని చెప్పి రీసెంట్ గా  షాకిచ్చాడు రానా దగ్గుబాటి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రానా.. సినిమా మేకింగ్ కోసం నిర్మాతలు చేసే అప్పులు, వాటి కోసం వాళ్ళు చెల్లించే అదిక వడ్డీల గురించి మాట్లాడాడు. " సినిమా చేయడం కోసం నిర్మాతలు అధిక వడ్డీలకు అప్పులు తెస్తారు. నాలుగేళ్ళ క్రితం పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటే రెండే ఆప్షన్స్ ఉండేవి. ఒకటి ఆస్తులను తాకట్టు పెట్టాలి, లేదా ఎక్కువ రేట్ కు అప్పులు తీసుకోవాలి. బాహుబలి సినిమా కోసం మేము దాదాపు రూ. 400 కోట్ల అప్పు తీసుకున్నాం అన్నారు.

అలాగే ఇందుకోసం 24- నుండి 28 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. నిజానికి ఇది చాలా ఎక్కువ. ఆ సమయంలో నిర్మాతలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. బాహుబలి సినిమా వర్క్ అవుట్ అయ్యింది కాబట్టి ఆ డబ్బు తిరిగి చెల్లించగలిగాం. ఒకవేళ ఫెయిల్ అయ్యుంటే ఎలా అనేది ఊహించుకోవడానికే భయంగా ఉంది.  ఆ సమయంలో మాకు ఉన్న ఒకే ఒక నమ్మకం రాజమౌళి. ఆయనపైన ఉన్న నమ్మకంతోమే మేమందరం ముందుకు వెళ్లాం. అంటూ చెప్పుకొచ్చాడు రానా. ప్రస్తుతం రానా చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనియ్యాంశం అయ్యాయి.   అయితే అదే సమయంలో ఈ విషయాన్ని ట్వీట్ చేసారు తమిళ ట్రేడ్ ఎనాలిస్ లుచేసే మనోబాల విద్యా బాలన్ ట్వీట్ చేసారు.

 "మూడు నాలుగేళ్ల కిందట సినిమాలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సినిమా తీసేవాళ్లు తమ ఇంటిన్నో, ఆస్తినో బ్యాంకులో తాకట్టు పెట్టి వడ్డీకి డబ్బు తెచ్చేవాళ్ళు. ఆ తర్వాత విడిపించుకునే వాళ్ళు. మేము కూడా 24 నుంచి 28% వరకు వడ్డీ కట్టే వాళ్ళం. సినిమాల్లో అప్పులు అలా ఉంటాయి. 'బాహుబలి' లాంటి సినిమా కోసం కూడా రూ.300 నుంచి రూ.400 కోట్ల రూపాయలను ఆ వడ్డీ రేటుకి తీసుకువచ్చారు" అని రానా వెల్లడించాడు.

‘‘బాహుబలి పార్ట్ వన్ రిలీజ్ అయిన తర్వాత మేకర్స్ 24% వడ్డీ రేటుకు ఐదున్నర ఏళ్ల పాటు రూ.180 కోట్ల అప్పు తీసుకున్నట్లు రానా. దీనికి రెట్టింపు ఖర్చు చేశాం. అందువల్ల మేము చేసిన అప్పు, సినిమా తీయడానికి పడిన కష్టాలైతే అన్నీ ఇన్నీ కావు. రూ. 180 కోట్లను 24 శాతానికి ఐదున్నర ఏళ్ల పాటు నిర్మాతలు అప్పుగా తీసుకున్నారు. ఇక ఆ తర్వాత బాహుబలి 2 కూడా చేసేసాం. ఒకవేళ ఆ సినిమా అప్పుడు ఆడకపోయి ఉంటే ఏం జరిగేదో అసలు ఊహించలేం" అంటూ చెప్పుకొచ్చాడు రానా.

అయితే ఈ విషయమై రకరకాల స్పందనలు వస్తున్నాయి. ఈ సినిమాకు రాజమౌళి ప్రొడ్యూసర్ కాదు కదా...శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని  గదా అలాంటప్పుడు ఆయన ఎందుకు లోన్ తీసుకుంటాడు అంటున్నారు. మరికొందరు సరే కానీ ఇంతకీ ఈ విషయం రాజమౌళి కు తెలుసా అని జోక్ చేస్తున్నారు. ఇప్పుడు రానా ఎందుకు ఇలాచెప్పాడు అనేది క్వచ్చిన్ గా మారింది. ఈ మాత్రం లాజిక్ రానా ఆలోచించలేదా అంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios