రాజమౌళి తనయుడు కార్తికేయ, జగపతిబాబు సోదరుని కుమార్తె పూజా ప్రసాద్‌ వివాహం రాజస్థాన్‌లో బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు మధ్య ఘనంగా జరిగింది. స్టార్ అంతా   కార్తికేయ, పూజల పెళ్లి సంగీత్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుక జయపురలో జరిగింది. ఈ నేపథ్యంలో అగ్ర తారలంతా శుక్రవారమే జయపురకు చేరుకున్నారు. శనివారం మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరిగాయి. ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా కార్తీకేయ, పూజల వివాహం జరిగింది.

ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్‌ల మధ్య సరదా సరదా సన్నివేశాలు, డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఇక ఈ పెళ్లి సందడి మొదలైనప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ‘bangaram saysSS’ అనే హ్యాష్‌ట్యాగ్‌ వైరల్‌ అవుతోంది. 

అయితే ఈ హ్యాష్‌ట్యాగ్‌ వెనక ఉన్న అర్థం ఏంటేంటే.. కార్తికేయ.. తన భార్య పూజను బంగారం అని పిలుస్తారట. పూజ..కార్తికేయను ‘ss’ అని ఇంటి పేరుతో సంబోధిస్తారట. అందుకే శుభలేఖలోనూ ‘bangaram saysSS’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా అచ్చువేయించినట్లు తెలుస్తోంది.