Asianet News TeluguAsianet News Telugu

చైతూకి మరో అత్త దొరికినట్లే..!

లేటెస్ట్ గా సౌత్ లో యువ హీరోయిన్స్ ఎంత మంది పోటీగా వస్తున్నా కూడా కొంత  మంది సీనియర్ హీరోయిన్స్ రేంజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. యువ హీరోయిన్స్ చాలా వరకు అవకాశాలను ఎగరేసుకొని పోతారనే టాక్ కి పలువురు సీనియర్ భామలు నటనతో సమాధానం చెబుతున్నారు. అందులో శ్రీయ శరన్ ఒకరు. 

sriya in venky mama
Author
Hyderabad, First Published Dec 12, 2018, 3:52 PM IST

శ్రియ పెళ్లి చేసుకున్న తరువాత కూడా అటు మ్యారేజ్ లైఫ్ ను ఇటు కెరీర్ ను ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. తన టైమ్ వచ్చినప్పుడు వచ్చిన ఆఫర్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అసలు విషయంలోకి వస్తే శ్రీయ చాలా కాలం తరువాత వెంకటేష్ తో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ జోడి సెట్టయితే నాగచైతన్యకు అత్త దొరికినట్లే. ఇప్పటికే శైలీజా రెడ్డి అల్లుడు సినిమాలో రమ్యకృష్ణకు అల్లుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రియ అల్లుడిగా కనిపించబోతున్నాడు. జై లవకుశ దర్శకుడు కెఎస్.రవీంద్ర వెంకీ మామ అనే సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్యకు రకుల్ ప్రీత్ సెట్టవ్వగా.. మామ వెంకీ కోసం గత కొన్ని రోజులుగా అత్త క్యారెక్టర్ కోసం హీరోయిన్ ను వెతుకుతున్నారు. 

కొత్త వారితో రిస్క్ తీసుకోకుండా ఏ పాత్రలో అయినా మెప్పించే శ్రీయను సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అని చిత్ర యూనిట్ ఆలోచించినట్లు సమాచారం. త్వరలోనే హీరోయిన్స్ విషయంలో అధికారికంగా వివరణ ఇచ్చి  షూటింగ్ స్టార్ట్ చేయడానికి నిర్మాత సురేష్ బాబు సన్నాహకాలు చేస్తున్నారు. ఇక ఇదివరకే వెంకటేష్ తో శ్రీయ సుభాష్ చంద్రబోస్ - గోపాల గోపాల సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.   

Follow Us:
Download App:
  • android
  • ios