శ్రియ హానీమూన్ ఎక్కడంటే

Sriya and andrie honeymoon in france
Highlights

శ్రియ హానీమూన్ కి ఎక్కడికి వెళ్లిందంటే

మ్యారేజ్ తర్వాత పత్తాలేకుండా హీరోయిన్ శ్రియ. సినిమాలకు సంబంధించి అప్పుడప్పుడు తన ట్విట్టర్‌లో ఏవో కొన్ని పోస్టులు పెడుతోంది. రష్యన్ ప్రియుడు ఆండ్రీకొచ్చీవ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత శ్రియ రష్యాకి మకాం మార్చేసినట్టు వార్తలొచ్చాయి. అది ఎంతవరకు నిజమన్నది కాసేపు పక్కనబెడితే.. తమ హనీమూన్ కోసం ఫ్రాన్స్‌ని ఎంచుకుంది ఈ జంట.
దీనికి సంబంధించి చిన్న హింట్ ఇచ్చేసింది శ్రియ. గత రాత్రి యూరోపియన్‌ లీగ్‌లో భాగంగా ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూశానంటూ స్టేడియంలో తీసుకున్న ఓ పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఫుల్‌బాల్ టోర్నమెంట్ ఇప్పుడు ఫ్రాన్స్‌లో జరుగుతోంది.ఈ లెక్కన శ్రియ-ఆండీలు అక్కడే వున్నట్లు ఫిక్సైపోయారు సినీ లవర్స్. ఇంతకీ గ్లామర్ ఇండస్ర్టీలో మళ్లీ ఎంట్రీ వుంటుందా? లేదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader