శ్రీరెడ్డి: అసభ్యపదజాలంతో నాని భార్యపై విరుచుకుపడింది!

srireddy comments on hero nani's wife
Highlights

నా భర్త ఇలా చేస్తే ఊరుకోను.. నాని భార్యకు శ్రీరెడ్డి కౌంటర్
 

శ్రీరెడ్డి-నాని విషయంలో ఇండస్ట్రీకు చెందిన కొందరు నానికి మద్దతుగా నిలుస్తున్నారు. నిజానికి శ్రీరెడ్డి ఎన్ని ఆరోపణలు చేసినా.. నాని పట్టించుకోలేదు. కానీ ఆమె వ్యవహారం మితిమీరడంతో లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నారు. నాని భార్య కూడా శ్రీరెడ్డిని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్లు చేసింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన శ్రీరెడ్డి.. నాని భార్యపై కౌంటర్లు వేసింది.

నీ భర్త నాతో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు నువ్వు అక్కడ లేవు కదా.. నీకు ఎలా తేలుస్తుంది.. అంటూ తనకు మాత్రమే వచ్చే అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడింది. నా భర్త గనుక ఇలా చేసి ఉంటే.. నేను బాధితురాలిని దూషించను.. నా భర్తపై చర్యలు తీసుకుంటాను అంటూ ఎలా ప్రవర్తించాలో నాని భార్యకు హితబోధ చేస్తోంది. కానీ ఆమె ఎన్ని ఆరోపణలు చేసినా.. వాటికి సంబంధించిన ఆధారాలను మాత్రం చూపించలేకపోయింది. 

పైగా నాని తనను మోసం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని బహిరంగంగానే చెప్పింది. ఈ క్రమంలో ఆమె మాటలు నమ్మడం ఎలా..? ముందు ఆరోపణలు చేయడం ఆ తరువాత నేను మిమ్మల్ని అనలేదు అంటూ చెప్పడం శ్రీరెడ్డికి కామనే.. ఈ వ్యవహారంలో నానిని ఇరికినచినంత మాత్రాన ఆయనకున్న ఇమేజ్ తగ్గుందనడానికి లేదు. కానీ ఈ విషయం మాత్రం నానికి అనవసరపు తలనొప్పే. మరి దీనికి ఎలా చెక్ పెడతాడో చూడాలి! 

loader