గత నాలుగు రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ..శ్రీను వైట్ల సెటిల్మెంట్. రీసెంట్ గా ఆయన డైరక్ట్ చేసిన 'అమర్ అక్బర్ ఆంటోని' డిజాస్టర్ వేవ్స్ ఇంకా ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి.
గత నాలుగు రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ..శ్రీను వైట్ల సెటిల్మెంట్. రీసెంట్ గా ఆయన డైరక్ట్ చేసిన 'అమర్ అక్బర్ ఆంటోని' డిజాస్టర్ వేవ్స్ ఇంకా ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ రేంజిలో ఆయన్ని డ్యామేజి చేసిందా సినిమా. నిర్మాతలు మైత్రి మూవీస్ వారు సైతం ఈ సినిమాతో పూర్తి గా నష్టపోయారు. 'శ్రీమంతుడు', 'రంగస్థలం' లాంటి హిట్స్ తో దూసుకుపోతున్న ఆ బ్యానర్‌కి మొదట నాగచైతన్య 'సవ్యసాచి' షాకిచ్చింది.
దాన్నుంచీ తేరుకునేలోపే 'అమర్ అక్బర్ ఆంటోని' పెద్ద దెబ్బ కొట్టింది. సర్లై హిట్స్, ప్లాప్స్ అనేవి ఇండస్ట్రీలో సహజమే అనుకుందామనుకున్నా..సినిమా ప్లాప్ అయితే సెటిల్మెంట్స్ ఉంటాయి. డిస్ట్రీబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కు వెనక్కి డబ్బు ఇవ్వటమో లేక..వారికి ఇంకో సినిమా ఇస్తానని హామీ ఇవ్వటమో చేయాలి. వాటి సంగతి అలా ఉంటే ..శ్రీను వైట్ల తన రెమ్యునేషన్ మనీ సెటిల్ చెయ్యమని అడిగారట.
సినిమా ఘోరంగా డిజాస్టర్ అయ్యి బ్యానర్ రిపుటేషన్ పోయిన మైత్రీ మూవీ మేకర్స్ వారిని తనకు ఇంకా బ్యాలెన్స్ రావలసి ఉందని అడిగాడట శ్రీను వైట్ల. దాంతో నిర్మాతలకు చిర్రెత్తుకొచ్చిందిట. మీ కెరీర్ పరిస్దితి బాగోపోయినా నమ్మి, ఎంతో ఖర్చు పెట్టి అడిగినవన్నీ ఇచ్చి సినిమా చేయమంటే.. మినిమమ్ గ్యారంటీ కూడా తీయలేదు...ఇప్పుడు రెమ్యునేషన్ ఎలా అడగగలుగుతున్నారు అని నిర్మాతలు స్టైయిట్ గా అడిగారని చెప్పుకుటుంటున్నారు. 'అమర్ అక్బర్ ఆంటోని' వల్ల తాము చాలా నష్టపోయామని, కాబట్టి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని, శ్రీను వైట్లకు కరాఖండీగా చెప్పేశారట.
దాంతో శ్రీను వైట్ల... సినీ పెద్దలు దగ్గరకు వెళ్లి ..ఈ విషయమై మాట్లాడినా ఫలితం ఉండదని అర్దం చేసుకుని వెనక్కి తిరిగాడట. ఇది ఫిల్మ్ సర్కిల్స్ లో వెబ్ మీడియాలో తిరుగుతున్న వార్త. ఇందులో నిజమెంత ఉందేనేది తెలియదు కానీ..నిజమైతే మాత్రం తప్పే అంటున్నారు. శ్రీను వైట్ల డబ్బులు విషయంలో ఖచ్చితంగా ఉంటాడని..కాబట్టి నిజం అయ్యే అవకాసం ఉందని కొందరు అంటున్నారు. ఏదైమైనా శ్రీను వైట్ల మళ్లీ హిట్ కొట్టి ప్రూవ్ చేసుకునే దాకా ఇలాంటి సమస్యలు, వార్తలు వస్తూనే ఉంటాయి.
