అమెరికన్ పాప్ స్టార్ ఇంట్లో రవితేజ మూవీ షూటింగ్

First Published 4, Apr 2018, 2:34 PM IST
srinu vaitla shooting raviteja amar akbar antony in jennifer lopez house
Highlights
శ్రీనువైట్ల అభిమాన స్టార్ ఇంట్లో తన మూవీ షూటింగ్

రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం ప్రస్తుతం యూఎస్ఏలో షూటింగ్ జరుపుకుంటోంది. రవితేజతో పాటు ఇతర ముఖ్య తారాగణంపై మార్చి 26 నుండి ఇక్కడ షూటింగ్ ప్రారంభం అయింది. తొలుత న్యూయార్కులో కొన్ని సీన్లు చిత్రీకరించిన అనంతరం షూటింగ్ కాలిఫోర్నియాకు షిప్టయింది. కాలిఫోర్నియా సమీపంలోని లాంగ్ ఐలాండ్‌లో ప్రముఖ హాలీవుడ్ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్‌కు సంబంధించిన భవనం పలాటియల్ హిడెన్ హిల్స్ మాన్షన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ విషయాన్ని శ్రీను వైట్ల ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఎగ్జైట్మెంట్ వ్యక్తం చేశారు.

జెన్నిఫర్‌ లోపెజ్‌‌కు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వీరాభిమానులు ఉన్నారు. వారిలో నేనూ ఒకడిని. క్వీన్‌ ఆఫ్‌ పాప్‌ నివాసమైన పలాటియల్ మాన్షన్‌లో మా తాజా చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాను చిత్రీకరిస్తున్నాం. నా కల నిజమైంది. ఇది నా బిగ్గెస్ట్ ఫ్యాన్ మూవెంట్' అని శ్రీను వైట్ల ట్వీట్‌ చేస్తూ ఓ వీడియో షేర్ చేశారు.

సినిమాలో ఈ బంగళా స్పెషల్ అట్రాక్షన్ అని, జెన్నిఫర్ లోపెజ్‌కు చెందిన అత్యంత విలాసవంతమైన భవనం ఇదని శ్రీనువైట్ల అన్నారు. దీని ఖరీదు $12.5 మిలియన్ డాలర్లు. గతంలో ఆమె ఈ ఇంట్లో తన మాజీ భార్త మార్క్ ఆంటోనీతో కలసి కొంతకాలం నివసించారు. 17000 స్కేర్ ఫీట్ల విస్తీర్ణం ఉన్న ఈ భవనంలో విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. రినోవేటెడ్ కిచెన్. రివాంప్డ్ మాస్టర్ బెడ్ రూం, స్పాతో కూడిన స్విమ్మింగ్ పూల్, రికార్డింగ్ స్టూడియో, జిమ్, 20 మంది కూర్చొని చూడగలిగే మూవీ థియేటర్, గేమ్ రూమ్, బార్, గెస్ట్ సూట్ అన్నీ ఉన్నాయన్నారు శ్రీను వైట్ల.

తమ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఈ భవనం స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుందని చెబుతున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెనర్ రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్లో నీ కోసం, వెంకీ, దుబాయ్ శ్రీను లాంటి చిత్రాలు వచ్చాయి. అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ బేనర్లో వీన్‌ యెర్నేని, రవి శంకర్‌, మోహన్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అమర్ అక్బర్ ఆంటోనీ దర్శకుడు శ్రీను వైట్లకు ఎంతో కీలకమైన సినిమా. ఈ మధ్య వరుస ప్లాపులతో వెనకపడ్డ ఆయన రవితేజతో చేస్తున్న ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫాంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు.

loader