మిస్టర్ కథను బన్నీ కోసం సిద్ధం చేసిన శ్రీను వైట్ల సరైనోడు, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల కోసం వదిలేసిన బన్నీ రీసెంట్ గా వరుణ్ తేజ్ తో  మిస్టర్ సినిమాను తెరకెక్కించిన శ్రీను వైట్ల

దూకుడు, బాద్షా లాంటి వరుస హిట్లతో తిరుగులేదనిపించుకున్న దర్శకుడు శ్రీను వైట్ల.. తర్వాత వచ్చిన ఆగడు, బ్రూస్‌లీ చిత్రాల పరాజయంతో పూర్తిగా డీలా పడ్డాడు. అయితే ప్రస్తుతం మిస్టర్ చిత్రంతో తన పూర్వ వైభవాన్ని పొందేందుకు సిద్ధమయ్యాడు శ్రీను వైట్ల.

ఆగడు, బ్రూస్‌లీ చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌ను దృష్టిలో పెట్టుకొని శ్రీను వైట్ల కథ రాసుకొన్నాడట. అది బన్నీకి కూడా తెగ నచ్చేసిందట. అయితే.. అదే టైంలో బోయపాటి చెప్పిన కథతో అల్లు అర్జున్ సరైనోడు చేయాల్సి వచ్చింది. అయితే అల్లు అర్జున్ సరైనోడు సినిమా చేయటమే కరెక్టని దాని రిజల్ట్ రుజువు చేసింది. బన్నీ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత బన్నీ ఆసక్తి చూపకపోవడంతో అదే కథను మిస్టర్‌గా వరుణ్ తేజ్‌కు వినిపించాడు. వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ కథ మిస్టర్‌గా రూపొందింది.

సరైనోడు తర్వాత మిస్టర్ కథతో బన్నీ సినిమా చేయకపోవడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి అట. ఆ చిత్రం క్లాస్ మూవీగా పేరు తెచ్చుకొంది. వరుసగా రెండు క్లాస్ చిత్రాలు చేయడం ఇష్టం లేకే బన్నీ మిస్టర్ కథను పక్కనపెట్టాడని శ్రీను వైట్ల పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీను వైట్లకు, వరుణ్ తేజ్‌కు మాస్ హిట్ చాలా అవసరం. ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందింతే ఇద్దరి ఖాతాలో పెద్ద హిట్ చేరినట్టే.