క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, కమిడియన్ గా, హీరోగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా మరో అవతారం ఎత్తి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నిర్మాతగా, దర్శకుడిగా మారి చేస్తున్న చిత్రం ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’.. (మంచి రసగుల్లా లాంటి సినిమా). ఆకృతి - ఆశృతి సమర్పణలో.. ఏ ఫ్లైయింగ్ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై.. శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మించిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ థియేట్రికల్ ట్రైలర్ మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు.

కామెడీ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. సత్య, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించగా, వెన్నెల కిశోర్, చిత్రం శ్రీను, రఘబాబు, సత్యం రాజేష్, సుమన్ శెట్టి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క జరుగుతోంది..ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయబోతున్నారు. ‘జ‌య‌మ్ము నిశ్చయ‌మ్మురా’ ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను అందించారు.

డిసెంబర్ 6న ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’ రిలీజ్ కానుంది. సినిమాటోగ్రఫీ : భరణి కె ధరన్, ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్, మ్యూజిక్ : సాకేత్ కోమండూరి, ఆర్ట్ : రఘు కులకర్ణి, లైన్ ప్రొడ్యూసర్ : చిత్రం శ్రీను, నిర్మాత, దర్శకత్వం : వై.శ్రీనివాస రెడ్డి.