ఎన్టీఆర్ కి ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా రాజీవ్ కనకాల, రఘు, రాఘవ, సమీర్ ఇలా చాలా మంది నటులతో ఎన్టీఆర్ చాలా క్లోజ్ గా ఉండేవారు. వీరితో పాటు కమెడియన్ శ్రీనివాస్ రెడ్డితో కూడా సన్నిహితంగా మెలిగేవారు. శ్రీనివాస్ రెడ్డి కూతురికి పేరు పెట్టడంతో పాటు ఉయ్యాల ఫంక్షన్ కి వెళ్లి ఆశీర్వదించారు ఎన్టీఆర్. అయితే కొంతకాలానికి ఎన్టీఆర్ సినిమాల్లో శ్రీనివాస రెడ్డి కనిపించడం మానేశారు.

ఇద్దరి మధ్య స్నేహం చెడిపోవడానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు శ్రీనివాస రెడ్డి. ఎన్టీఆర్ సినిమాలకు దూరం కావడానికి చాలా కారణాలున్నాయని చెప్పాడు. తనకు పెళ్లి కావడం, వేరే సినిమాల్లో ఉండడం, ఎన్టీఆర్ సినిమాల్లో ఇచ్చిన పాత్రలకు ప్రాముఖ్యత లేదనుకొని వద్దులే అనుకోవడం ఇలా చాలా కారణాలతో ఎన్టీఆర్ సినిమాలతో గ్యాప్ వచ్చిన మాట నిజమేనని అన్నారు.

అయితే ఈ గ్యాప్ రావడానికి ఎన్టీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కారణమయ్యారని చెప్పాడు. ఎన్టీఆర్ తో తనకు మంచి రిలేషన్ ఉండేదని చెబుతూ.. ''ఎన్టీఆర్ ఎలెక్షన్ ప్రచారానికి వెళ్లినప్పుడు అతడితో పాటు కొందరం స్నేహితులం వెళ్లి జాయిన్ అయ్యేవాళ్లం. నేను ఎన్టీఆర్ ప్రచారం ఖమ్మం వచ్చిన తరువాత జాయిన్ అవుతానని చెప్పా.. అదే సమయానికి పండగ వచ్చింది. అందరం ఊళ్లకు బయలుదేరాం. తారక్ నన్ను కారు ఎక్కు అన్నారు. అయితే నాతో పాటు పెద్ద బ్యాగ్ కూడా ఉంది. అది తెచ్చుకునేలోపు ఆ ప్లేస్ లో ఇంకొకరు ఎక్కారు. ఆ కారు బయలుదేరింది. అప్పుడు నేను వెనుక కారులో వెళ్లా.. కొంత దూరం వెళ్లిన తరువాత తారక్ కార్ కి యాక్సిడెంట్ అయింది. తారక్ గాయాలతో రక్తం కారుతూ కనిపించడంతో వెంటనే నా బ్యాగ్ లో ఉన్న టవల్ ఆయనకి చుట్టి నా కార్ లో ఎక్కించుకొని దగ్గరలో హాస్పిటల్ కి తీసుకెళ్లా.. ఆ తరువాత కిమ్స్ కి తీసుకువెళ్లాం.. ఈ ప్రాసెస్ లో ఓ వ్యక్తి 'నువ్ అడుగుపెట్టావ్.. తారక్ కి యాక్సిడెంట్ అయింది' అన్నాడు. నన్ను అంత మాట అనేశాడని.. 'నేను ఉండబట్టే తారక్ ప్రాణాలతో వచ్చాడు.. లేకపోతే ఏమయ్యేదో' అనిఅన్నాను. ఆ మాట తారక్ వరకు వెళ్లడంతో ఆయనతో నటించే అవకాశం రాలేదనుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. 

తను అన్నదానికి మరికొంత యాడ్ చేసి తారక్ కి చెప్పి ఉంటారని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ఇది జరిగిన తరువాత తారక్ ని కలిసి సరదాగా మాట్లాడుకుంటూ అంతకుముందు ఉన్న బాండింగ్ లేదని అన్నారు. ఈ విషయాన్ని తారక్ తో క్లియర్ చేసుకుంటానని అన్నారు.