సావిత్రి గా శ్రీముఖి... లుక్ తో కిక్కిచ్చింది

Srimukhi as savarithri
Highlights

సావిత్రి గా శ్రీముఖి... లుక్ తో కిక్కిచ్చింది

టీవీ యాంకర్లలో మేటిగా పేరు తెచ్చుకున్న అతికొద్దిమందిలో శ్రీముఖి ఒకరు. ఆమెలోని స్పాంటేనియటీ, బోల్డ్‌నెస్ ఆమెను అక్కడ నిలబెట్టింది. ముఖ్యంగా కో-యాంకర్ రవితో కలిసి చేస్తున్న ‘పటాస్’ టెలివిజన్ షో.. శ్రీముఖిలోని టాలెంట్ లెవల్స్‌ని బాగా ఎక్స్‌పోజ్ చేస్తోంది. యూత్, స్టూడెంట్ ఏజ్‌గ్రూప్‌లో శ్రీముఖికంటూ ఒక ఖచ్చితమైన ఫాలోయింగ్ వుంది. ఈ మాత్రం కరిష్మా సొంతం కావడానికి ఆమె మెయింటేన్ చేసే డ్రెస్‌కోడ్ కూడా ముఖ్య కారణంగా చెబుతారు. ఒంటి నిండా గుడ్డలేసుకోకపోవడమే ఆమెకంత క్రేజ్ తెచ్చిపెట్టిందంటే తప్పు లేదు కూడా. ఇదిలా ఉంటే.. మిస్ శ్రీముఖి.. సడన్‌గా శారీలో మెరిసింది. సంప్రదాయబద్ధమైన ప్రౌఢ వయసు మహిళలా కనిపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ‘గుండమ్మ కథలో సావిత్రి’ అంటూ టాగ్ తగిలించి ఈ ఫొటోల్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసుకుంది. పటాస్ ప్రోగ్రాం కోసం చేసే సినిమా స్పూఫ్‌లో భాగంగానే ఈ గెటప్ వేసిందట శ్రీముఖి. ఏదేమైనా.. ఆ శ్రీముఖేనా ఈ శ్రీముఖి అంటూ కళ్ళు నులుముకుని మళ్లీమళ్లీ చూస్తున్నారు నెటిజన్లు.

loader