శ్రీలంక యంగ్ లేడీ సింగర్ యోహాని డిలోక డిసిల్వా  సంగీత ప్రియులను ఓలలాడించనుంది. జీ లైవ్ సౌజన్యంతో ఈ మెగా మ్యూజిక్ ఫస్ట్ అక్టోబర్ 3న సాయంత్రం 7:00 గంటల నుండి జరగనుంది. ఈ ఈవెంట్ కి హార్ట్ కప్ కాఫీ, గచ్చిబౌలి వేదిక కానుంది. 

గ్రేటర్ హైదరాబాద్ అతిపెద్ద మ్యూజిక్ ఫెస్ట్ కి వేదిక కానుంది. శ్రీలంక యంగ్ లేడీ సింగర్ యోహాని డిలోక డిసిల్వా  సంగీత ప్రియులను ఓలలాడించనుంది. జీ లైవ్ సౌజన్యంతో ఈ మెగా మ్యూజిక్ ఫస్ట్ అక్టోబర్ 3న సాయంత్రం 7:00 గంటల నుండి జరగనుంది. ఈ ఈవెంట్ కి హార్ట్ కప్ కాఫీ, గచ్చిబౌలి వేదిక కానుంది. 


దీనితో సింగర్ యోహాని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యూజిక్ ఫెస్ట్ టికెట్స్ కోసం పోటీపడుతున్నారు. బుక్ మై షోలో యోహాని మ్యూజిక్ లైవ్ షో టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. 


ఇక యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన యోహాని తన మ్యూజిక్ టాలెంట్ తో సూపర్ పాప్యులర్ అయ్యారు. ఆమె చేసిన 'మానికే మాగే హితే' కవర్ సాంగ్ 122 మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టించింది. శ్రీలంక కొలంబోలో జన్మించిన 23ఏళ్ల యోహాని సాంగ్ రైటర్ గా, కంపోజర్ గా పలు ఆర్ట్స్ లో ప్రావీణ్యత సంపాదించారు. ఇండియాలో మొదటిసారి ఢిల్లీలో షో ఇచ్చిన, యోహాని ఆదివారం నాడు హైదరాబాద్ సంగీత ప్రియులను ఫిదా చేయనున్నారు.