ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు కదులుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రూమర్స్ ఏ స్థాయిలో వస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఆయనను స్పెషల్ గా టార్గెట్ చేయడం కూడా అందరికి తెలిసిందే. ఇకపోతే పార్టీలో చేరికలపై కూడా సినీ నటులు ఇంట్రెస్ట్ చూపుతున్నారని అనేక రూమర్స్ వచ్చాయి. 

రీసెంట్ గా దర్శకుడు వినాయక్ అలాగే కమెడియన్ అలీతో కలిసి నటుడు శ్రీకాంత్ జనసేనలోకి చేరనున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై శ్రీకాంత్ స్పందించాడు. తాను రాజకీయాల్లోకి రావడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదని రాజకీయాల్లో ఉన్న వారందరికీ తన విషెష్ అందిస్తాను గాని నేను ఏ పార్టీలో అడుగుపెట్టనని అన్నారు. 

జనసేనలో చేరబోతున్నట్లు వస్తోన్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని అవి కేవలం రూమర్సేనని శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ఇక డిసెంబర్ 1 రిలీజ్ కానున్న ఆపరేషన్ 2019 సినిమా ఏ పార్టీని ఉద్దేశించి తీసినది కాదని చెబుతూ.. తన కుమారుడు రోషన్ తదుపరి చిత్రం నెక్స్ట్ ఇయర్ ఉంటుందని వివరణ ఇచ్చారు.