యాక్షన్ సినిమాల్లో హీరోగా ఆ తర్వాత ఢీ వంటి సినిమాలలో కీలకమైన క్యారక్టర్ ఆర్టిస్ట్ గా , కమిడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న నటుడు శ్రీహరి. ఆయన కెరీర్ పీక్స్ లో ఉండగానే అనారోగ్యంతో ఆరేళ్ల క్రితం కన్ను మూసారు. శ్రీహరికు తన కుమారుడులలో ఒకరిని హీరోగానూ, మరొకరని డైరక్టర్ గానూ చూడాలని కోరిక. ఈ నేపధ్యంలో  ఆయన కుమారుడు మేఘాంశ్ హీరోగా మారాడు.  

‘రాజ్‌దూత్’టైటిల్ తో  ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐతే దురదృష్టం ఏమిటంటేట సినిమాకు మినిమం రెస్పాన్స్ కూడా రాలేదు. సినిమాలో అక్కడక్కడా వచ్చే  కొన్ని బైక్ జర్నీ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదనిపించినా.. కథ,స్క్రీన్ ప్లే ఏ మాత్రం ఇంట్రస్ట్ గా సాగక పోవడం, సినిమాలో సరైన ప్లో లేకపోవడం, ఓవరాల్ గా  స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమాని బాగా దెబ్బ తీశాయి.  

దానికి తోడు సరైన ప్రమోషన్ లేకపోవటంతో  ‘రాజ్ దూత్’పై ఎలాంటి బజ్ లేదు. సినిమాను సరిగా ప్రమోట్ చేసుకోలేకపోయారు. మేఘాంశ్ పట్ల జనాల్లో ఇంట్రస్ట్ కలిగించి ఓపినింగ్స్ తేలకపోయారు. ‘రాజ్ దూత్’ టీజర్, ట్రైలర్ కూడా ఏమంత స్పెషల్ గా లేవు. దీనికి తోడు‘నిను వీడని నీడను నేనే’, ‘దొరసాని’ సినిమాల  పోటీ మధ్య దీన్ని రిలీజ్ చేశారు. వాటికి  ఓపెనింగ్స్ ఓ మోస్తరుగా అయినా వచ్చాయి. ‘రాజ్ దూత్’కి అయితే అదీ లేదు. 

సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే ఎక్కడా చర్చ లేదు. రివ్యూలు కూడా కనిపించడం లేదు.  ఏదైమైనా శ్రీహరి   కొడుకు లాంచింగ్ ఇంత చప్పగా మాత్రం ఉండకూడదని ఆయన అభిమానులు భావిస్తున్నారు..బాధపడుతున్నారు.