పెళ్ళి కాకపోయినా.. బుల్లితెరపై స్టార్ కపుల్ గా వెలుగుతున్నారు శ్రీహాన్, సిరి. ఈ ఇద్దరు కలిసి పెద్ద ప్రాజెక్ట్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎదుురు చేస్తున్నారు. ఇక వారి కోరక తీర్చడానికి భారీ ప్రాజెక్ట్ తో రాబోతున్నారట. 

శ్రీహాన్ ‌‌- సిరి హనుమంత్ ఇద్దరు బుల్లితెరపై నుంచి ఎదిగినవారే. టిక్ టాక్ వీడియోస్.. షార్ట్ ఫిల్మ్స్ .. షార్ట్ మూవీస్, కామెడీ సీరియస్స్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా బుల్లితెర ప్రేక్షకులను పలుకరించి సందడి చేసి..వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఇద్దరికి మరింత ఫేమ్ తీసుకు వచ్చింది మాత్రం బిగ్ బాస్ అనే చెప్పాలి. బిగ్ బాస్ 5 లో సిరీ హన్మంత్ హాట్ టాపిక్ గా మారితే.. బిగ్ బాస్ 6 లో శ్రీహాన్ విన్నింగ్ వరకూ వచ్చాడు. ఇక్కడినుంచి వీరిద్దరి క్రేజ్ మరింత పెరిగిందనిచెప్పాలి. ఈక్రమంలోనే విరిద్దరకు కలిసి ఇన్ స్టా రీల్స్ తో.. నెటిజన్లకు మరింత దగ్గర అయ్యారు. 

ఇక బుల్లితెర అందాల భామగా సిరి హనుమంతుకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. శ్రీహాన్ కంటే ముందే ఆమె పాపులర్ అయ్యింది. రీసెంట్ గా జీ 5 నుంచి వచ్చిన పులి - మేక వెబ్ సిరీస్ లోను సిరి ఒక ముఖ్యమైన పాత్రలో హడావిడిచేసింది. ఇక ఈ వెబ్ సిరీస్ సీజన్ 2లో కూడా ఆమె పాత్రనే లీడ్ తీసుకోనున్నట్టుగా చూపించారు. ఈ వెబ్ సిరీస్ ఆమె కెరీర్ కు చాలా ప్లస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆమె సిల్వర్ స్కీర్ కు వెళ్లే ప్రయత్నంచేస్తోంది. ఇక అటు శ్రీహాన్ విషయం చూసుకుంటే ..షం. 

ఇక శ్రీహాన్ కి బిగ్ బాస్ సీజన్ 6 వల్ల అతనికి మంచి గుర్తింపు వచ్చింది. శ్రీహాన్ - సిరి లవ్ మ్యాటర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు చేసే హాడావిడి.. ప్రస్తుతం ఇన్ స్టా రీల్స్ ద్వారా చేస్తున్న హడావిడి కూడా తెలిసిందే. ఇక వీరి ప్రేమ వ్యవహారం బాగా హైలెట్ అయ్యి.. తెలియని వారికి కూడా తెలిసేలా చేసింది మాత్రం బిగ్ బాస్ వల్లే.
ఇక ఈ జంట కలిసి ఏదైన ప్రాజెక్ట్ చేస్తే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఫ్యాన్స్ కోరికమేరకు వీరు కలిసి నటిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ కపుల్ వెబ్ సిరీస్ లో కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిరి మాట్లాడుతూ .. మా ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూడటానికి ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అందువలన మేమిద్దరం కలిసి వెబ్ సిరీస్ లో చేద్దామని అనుకున్నాము. ఇంతలో శేఖర్ మాస్టర్ ప్రొడక్షన్ హౌస్ లో చేసే ఛాన్స్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ లో చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈవెబ్ సిరీస్ కు శేఖర్ మాస్టరే డైరెక్టర్ అని సమాచారం.