ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన చర్చ కూడా జరిగింది. రేవంత్‌, గీతూ, ఫైమా వారంతా ఆరో వారం ఎవరి ఎలిమినేట్‌ అవుతారనేది ముందుగానే ఊహాగనాలు ప్రారంభమయ్యాయి.

బిగ్‌ బాస్‌ ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఐదుగురు ఎలిమినేట్‌ అయ్యారు. ఆరో వారంలో నామినేషన్ల ప్రక్రియ హీటెక్కించింది. కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరింది. సోమవారం ఎపిసోడ్‌లో హౌజ్‌ మొత్తం హీటెక్కిపోయింది. మంగళవారం(36వ ఎపిసోడ్‌) నామినేషన్ల అనంతరం చర్చలు ప్రధానంగా సాగాయి. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రధానంగా సాగింది. 

ఈ క్రమంలో ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన చర్చ కూడా జరిగింది. రేవంత్‌, గీతూ, ఫైమా వారంతా ఆరో వారం ఎవరి ఎలిమినేట్‌ అవుతారనేది ముందుగానే ఊహాగనాలు ప్రారంభమయ్యాయి. హౌజ్‌లోనే ప్రిడిక్షన్‌ స్టార్ట్ కావడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ పక్కా అని చెబుతాడు రేవంత్. అయితే సుదీప, కీర్తి ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలున్నాయని తేల్చి చెప్పింది గీతూ. ఇదే హౌజ్‌లో ఓ వైపు హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఈ క్రమంలో హౌజ్‌మేట్స్ కి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఛార్జింగ్‌ నింపుకోవడమనేది టాస్క్ పేరు. బాడీని ఛార్జింగ్‌ చేసుకుని రెట్టింపు ఎనర్జీతో గేమ్‌ ఆడాలనేది బిగ్‌ బాస్‌ ఇచ్చిన టాస్క్. ఇందులో వంద శాతంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. హౌజ్‌మేట్స్ బిగ్‌ బాస్‌ సర్‌ప్రైజ్‌లిస్తారు. ఒక్కో ఆప్షన్‌ ప్రకారం కొంత శాతం బ్యాటరీ ఛార్జింగ్‌ తగ్గిపోతుంది. మరి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ హౌజ్‌ మేట్స్ కొన్ని ఇతరుల కోసం సాక్రిఫైజ్‌ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 

అయితే ఇందులో సర్‌ప్రైజ్‌లు చూసి అంతా ఎమోషనల్‌ అవుతారని చర్చించుకుంటుండగా, తాను ఎమోషనల్‌ కానని, తాను ఏడవనని తెలిపింది గీతూ. అంతేకాదు తనని ఏడిపించు బిగ్ బాస్‌ అంటూ ఏకంగా ఛాలెంజ్‌ కూడా విసిరింది. ఇదే హాట్‌ టాపిక్‌ అవుతుంది. అనంతరం టాస్క్ ప్రారంభించగా, మొదట శ్రీహాన్‌ని కన్ఫెషన్‌ రూమ్‌కి పిలిచారు బిగ్‌బాస్. అందులో మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి నాన్నతో వీడియో కాల్‌ మాట్లాడటం,అందుకే 35శాతం బ్యాటరీ తగ్గిపోతుందని, సిరితో ఆడియో కాల్ చేసినందుకు 30శాతం, ఇంటి ఫుడ్‌ తీనేందుకు 15 శాతం ఛార్జింగ్‌ తగ్గిపోతుందని తెలిపారు.

 ఇతరులు తనకంటే బాధలో ఉన్నారని, వారికి మాట్లాడే అవకాశం రావాలని చెప్పి శ్రీహాన్‌ తన ప్రియురాలు సిరిని త్యాగం చేశాడు. ఆమెతో ఆడియో సందేశం పొందేందుకు నిరాకరించారు. ఇంటి నుంచి వచ్చిన మటన్‌ బిర్యానీ ఆరగించాడు శ్రీహాన్‌. అయితే సిరిని, ఫ్యామిలీని మిస్‌ అయినందుకు చాలా బాధపడ్డాడు శ్రీహాన్‌. అనంతరం సుదీపకి అవకాశం వచ్చింది. ఆమెకి భర్తతో మాట్లాడే అవకాశం వినియోగించుకుంటే 30శాతం, భర్త పంపిన టీషర్ట్ పొందాలంటే 40శాతం, అమ్మ చేసిన చికెన్ కర్రీ పొందాలంటే 35శాతం బ్యాటరీ ఖర్చు అవుతుందని చెప్పారు. ఇందులో సుదీప భర్తతో ఆడియో కాల్‌కి ఒప్పుకుంది. భర్తతో మాట్లాడింది సుదీప. 

ఆదిరెడ్డి వంతు వచ్చింది. భార్య, కూతురుతిలో వీడియో కాల్‌ మాట్లాడేందుకు 40శాతం, భార్య ఆడియె కాల్‌కి30 శాతం పెట్టగా, కూతురు పంపిన టీషర్ట్ ధరించాలంటే 35శాతం బ్యాటరీ చెల్లించాల్సి వచ్చింది. ఎంతో మదన పడిన ఆదిరెడ్డి తన కూతురు, భార్యతో మాట్లాడేందుకు ఓకే చెప్పాడు. అందుకు 40శాతం బ్యాటరీని వదులుకున్నారు. భార్య, కూతురుతో కలిసి కాసేపు వీడియో కాల్‌ మాట్లాడాడు. ఎమోషనల్‌ అయ్యాడు ఆదిరెడ్డి. తాను ఎక్కడ ఉన్నా, ఇప్పుడు ఎక్కడికి వచ్చానని ఆయన తన జర్నీని గుర్తు చేసుకున్నాడు.