గతంలో బిగ్‌ బాస్‌ 6 తెలుగు షోలో అర్జున్‌, ఆర్జే సూర్య పులిహోర కలిపారు. ఇప్పుడు ఆ బాధ్యతలు శ్రీహాన్‌ తీసుకున్నారు. ఇద్దరమ్మాయిలతో రెచ్చిపోతున్నాడు. 

బిగ్‌ బాస్‌ 6 తెలుగు హౌజ్‌లో మన్మథులుగా ఒకరి తర్వాత ఒకరు తయారవుతున్నారు. మొదట అర్జున్‌ మన్మథుడిలా వ్యవరించారు. అటు శ్రీసత్య, ఇటు వాసంతిలతో బాగానే పులిహోర కలిపాడు. అనూహ్యంగా ఆయన ఎలిమినేట్‌ అయ్యాడు. ఆ తర్వాత సూర్య.. ఇనయతో కలిసి పులిహోర కలిపి మన్మథుడి అవతారం ఎత్తాడు. ఆయన కూడా ఎలిమినేట్‌ అయ్యాడు. ఇప్పుడు శ్రీహాన్‌ ఆ బాధ్యతలు తీసుకున్నట్టు తెలుస్తుంది. చూడబోతుంటే ఆయన కిచెన్‌లో అటు శ్రీసత్యతో, బయట వాసంతితో పులిహోర కలుపుతూ కనిపిస్తున్నాడు. 

నాగార్జున ముందు కూడా ఈ విషయం బట్టబయలు కావడం విశేషం. శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి ఇంటి సభ్యులకు క్లాస్‌ పీకడాలు చేస్తుంటారు. ఎవరు బాగా చేశారు, ఎవరు రాంగ్‌ చేశారనేది చెబుతుంటారు. కానీ ఈ వారం అదేమీ జరగలేదు. డాక్టర్‌-పేషెంట్‌ గేమ్‌ ఆడించారు. ప్రతి ఒక్క సభ్యుడు అక్కడ ఉన్న రోగాలకు సంబంధించిన ట్యాగ్‌లను ఆ కంటెస్టెంట్‌పై వేసి కారణం చెప్పాల్సి ఉంటుంది. ఇందులో శ్రీసత్య, శ్రీహాన్‌, వాసంతిల టాపిక్ వచ్చినప్పుడు వాళ్లు హౌజ్‌లో ఏం చేశారో చెప్పారు నాగ్‌. 

వాసంతి అందంపై శ్రీహాన్‌ పొగడ్తలు చేస్తున్నాడని, ఆమె వెనకాల స్లో మోషన్‌లో వెళ్తుంటాడని అదేంటో అర్థం కాదని, బాగా ఆమె మాయలో పడిపోయాడేమో అని శ్రీ సత్య కామెంట్‌ చేయడం విశేషం. ఇదే విషయాన్ని ఒప్పుకుంటూ నిజమే అని వాసంతి అనడం, తననుంచి ఏదో ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడని, అదేంటో అర్థం కావడం లేదని తెలిపింది. అయితే తాను నువ్వు అందంగా ఉంటావని నిజంగానే పొగుడుతున్నానని తెలిపాడు శ్రీహాన్‌. ఈ కన్వర్జేషన్ చూస్తుంటే శ్రీహాన్‌ ఆమెతో పులిహోర కలుపుతున్నాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. 

మరోవైపు ఈ ఎపిసోడ్‌ కిచెన్‌లో వంటలు చేసే సమయంలో శ్రీసత్యతో శ్రీహాన్‌ చనువుగా మెలిగిన తీరు, ఆమెపై కామెంట్లు చేయడం, గుసగుసలు పెట్టడం చూస్తుంటే శ్రీసత్యతోనూ పులిహోర కలుపుతున్నారని అర్థమవుతుంది. నాగ్‌ ముందు కూడా ఆ విషయం స్పష్టమైంది. వాసంతి కూడా సత్య.. శ్రీహాన్‌ని మానిప్యూలేట్‌ చేస్తుందని చెప్పడం విశేషం. మొత్తానికి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే దోరణిలో శ్రీహాన్‌ పులిహోర కలుపుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం విశేషం. అంతేకాదు శ్రీహాన్‌ మంచి మన్మథుడే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులతో డాక్టర్‌-పేషెంట్‌ ఆట ఆడించారు. ఎవరికి ఏ జబ్బు ఉందో, దానికి మందేంటో వేయాల్సి ఉంటుంది. మొదట కెప్టెన్‌ అయిన ఫైమాని అభినందించారు నాగ్‌. అలాగే సిగరేట్‌ తాగకుండా ఉండటమేకాదు, గార్జెన్‌లో ఆయన చెప్పిన మాటలకు అభినందనలు తెలిపారు. అనంతరం టాస్క్ లో రేవంత్‌కి మొండితనం అనే ట్యాగ్‌ ఇచ్చి అందుకు కారణం చెప్పింది శ్రీ సత్య. కషాయం తాగించింది. వాసంతి ఇమ్మెచ్యూర్‌ అని ఇనయ చెప్పగా, చివర్లో నిజమే అని నాగ్‌ తేల్చేశాడు. 

ఇనయ వితండవాదం చేస్తుందని రాజ్‌ చెప్పారు. ఈ సందర్భంగా నామినేషన్స్ లో ఫైమాని ఇనయ అడల్ట్ కామెడీ స్టార్‌ అని పిలవడాన్ని తప్పుపట్టాడు. ఇంకెప్పుడు, ఎవరూ పర్సనల్‌గా కామెంట్‌ చేయకూడదని వార్నింగ్‌ ఇచ్చాడు. ఇనయాకి ఫైమా ఓవర్‌ కాన్ఫిడెంట్‌ అనే ట్యాగ్ ఇచ్చింది. మెరీనా.. వాసంతికి నమ్మకద్రోహం అనే ట్యాగ్‌ ఇచ్చింది. ఇనయాకి ఆదిరెడ్డి ఈగో అనే ట్యాగ్‌ ఇచ్చాడు. శ్రీసత్యకి రేవంత్‌ కక్కుర్తి అనే ట్యాగ్‌ ఇవ్వగా, ఈ సమయంలో జరిగిన కన్వర్జేషన్‌ నవ్వులు పూయించింది. ఇనయాకి తలపొగరు అని రోహిత్‌, సత్యాకి ఈగో అని కీర్తి, ఫైమాకి స్వార్థమని బాలాదిత్య, రేవంత్‌కి స్వార్థం అని శ్రీహాన్‌, శ్రీహాన్‌ మానుప్యూలేటర్‌ అని వాసంతి చెప్పడం విశేషం. అనంతరం ఊహించని విధంగా బాలాదిత్యని నాగ్‌ ఎలిమినేట్‌ చేసిన విషయం తెలిసిందే.