కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 క్రమంగా రసవత్తరంగా మారుతోంది. ఒక్కొక్కరూ ఎలిమినేట్ అయ్యే కొద్దీ బలమైన కంటెస్టెంట్స్ నిలబడుతున్నారు.
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 క్రమంగా రసవత్తరంగా మారుతోంది. ఒక్కొక్కరూ ఎలిమినేట్ అయ్యే కొద్దీ బలమైన కంటెస్టెంట్స్ నిలబడుతున్నారు. 54వ ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ నిర్వహించడంతో ఆసక్తికరంగా మారింది. నిన్న జరిగిన చేపల టాస్క్ లో విజయం సాధించిన శ్రీహాన్, శ్రీసత్య నేరుగా కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించారు.
మిగిలిన జంటలు ఎవరికి వారు చర్చించుకుని ఒకరు డ్రాప్ అవ్వాలని బిగ్ బాస్ కోరారు. మిగిలిన జంటలలో సూర్య, రేవంత్, కీర్తి, ఫైమా కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించారు. తనని టార్గెట్ చేసిన గీతూపై రేవంత్ కోపంతో ఊగిపోయాడు. గీతూకి కోలుకోలేని దెబ్బ ఇస్తా, నేనెంటో చూపిస్తా అంటూ రేవంత్ శపథం చేశాడు.
ఇంతలో కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ మొదటి రౌండ్ అనౌన్స్ చేశారు. మొదటి రౌండ్ పేరు చిక్కులో కెప్టెన్సీ. వాసంతి ఈ రౌండ్ కి సంచలకురాలిగా వ్యవహరించింది. ఇందులో భాగంగా కెప్టెన్సీకి అర్హత సాధించిన వారందరికీ నడుముకి తాడులు కట్టారు. ఆ తడులన్నీ గజిబిజిగా చేసి చిక్కుముడులతో ఉంటాయి. ఆ చిక్కు ముడులు విప్పుకుని గంట మోగించిన మొదటి ముగ్గురు సభ్యులు రెండవ రౌండ్ కి అర్హులు. ఈ టాస్క్ లో కీర్తి, సూర్య, శ్రీహన్ విజయం అందించి రెండవ రౌండ్ కి అర్థత పొందారు.
రెండవ రౌండ్ లో ఈ ముగ్గురు ఆంగ్ల సి అక్షరం ఉన్న పెద్ద వెస్ట్ ధరించాలి. మిగిలిన సభ్యులకు తాము కెప్టెన్సీకి ఎందుకు అర్హులమో వివరించాలి. ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా కెప్టెన్సీకి ఎవరు అర్హులు కాదు అని భావిస్తే వారి వెస్ట్ ని కత్తితో పొడుస్తారు. అలా టాస్క్ ముగిసే సరికి ఎవరి వెస్ట్ లో ఎక్కువ కత్తులు ఉంటే వారు అనర్హులు. తక్కువ కత్తులు ఉన్నవారు విజయం సాధిస్తారు.
నేటి ఎపిసోడ్ ముగిసే సమయానికి సూర్య అత్యధికంగా మూడు కత్తి పోట్లకి గురవుతాడు. కీర్తికి 2, శ్రీహన్ కి ఒక కత్తి పోటు వస్తుంది. శ్రీహన్ కి కత్తి పోటు ఇనయ వేస్తుంది. శ్రీహన్ మంచి వాడు అంటూనే అతడికి స్థిరత్వం లేదని ఇనయ ఆ కత్తి పోటు వేస్తుంది. ఇనయ ప్రవర్తన శ్రీహన్ కి కోపం తెప్పిస్తుంది. తన పక్కన ఉన్న వారితో.. ఇనయ ఊరసవెళ్లి లాంటిది. వారానికి ఒకరితో ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్ రౌండ్ 2 విజేత ఎవరో శుక్రవారం తేలనుంది.
