సినిమా ఇండస్ట్రీలో 80వ దశకంలో టాప్ హీరోయిన్ గా ఎన్నో సంచలనాలు సృష్టించారు శ్రీదేవి.  బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగులో సీనియర్ హీరోలతో హీరోయిన్ గా నటించి తెలుగు, తమిళ,మళియాళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా నటించింది.  ఇక హిమ్మత్ వాలా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి అక్కడే స్ధిరపడిపోయింది.  అయితే శ్రీదేవి ఏ హీరో పక్కన నటించిన మంచి జోడి అనిపించేది. ఒకప్పుడు శ్రీదేవి, కమల్ హాసన్ నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.

 

తమిళ ఇండస్ట్రీలో వీరు కలిసి నటించిన పలు సినిమాలు ఇప్పటికీ సూపర్ హిట్ టాక్ అని అంటారు.  కాగా, ఈ మద్య సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు శ్రీదేవి, కమల్ హాసన్ మద్య అదేదో సంబంధాలు ఉన్నాయని రూమర్లు పుట్టుకొస్తున్నాయి. వీటిపై స్పందించిన  సినీ నటుడు, మక్కల నీది మయ్యం పార్టీ అధినేత కమల హాసన్ అసహనం వ్యక్తం చేశారు.  దివంగత శ్రీదేవి తనకు సోదర సమానురాలని ఆయన స్పష్టం చేశారు. తాను కూడా ఆమెతో కలిసి ఆమె తల్లి చేతి గోరుముద్దలు తిన్నానని గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి తనకు చెల్లెలితో సమానమని ఆయన తెలిపారు.

 

ఆమె గొప్ప నటి..భార్య, తల్లి అని ఇలాంటి రూమర్లు పుట్టించే ముందు అసలు విషయాలు తెలుసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. లేని పోని వదంతులు సృష్టించి ఇబ్బంది పెట్టవద్దని ఆయన మీడియాను కోరారు. జాగా కమల్ రాజకీయ పార్టీని పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శనాత్మక కథనాలు ప్రసారమవుతున్నాయి. అందులో భాగంగా ప్రసారమవుతున్న కథనాలను ఆయన ఖండించారు